ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినీరత్న కంపెనీ వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్.. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,281 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ఐటీఐ అప్రెంటిస్ సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఈ నెల 21తో ముగియనుంది. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తర్ణులైన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జాబ్ నోటిఫికేషన్ సహా మరిన్ని వివరాల కోసం http://westerncoal.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.


విభాగాల వారీగా ఖాళీలు ఇవే.. 
ఎలక్ట్రీషియన్ - 250, ఫిట్టర్ - 242, టెక్నీషియన్ అప్రెంటిస్ - 215, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ -219,  గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 101,  వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) - 76,  వైర్‌మ్యాన్ - 40, మెకానిక్ (డీజిల్) - 36,  డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్) - 28,  సర్వేయర్ - 20, టర్నర్ - 17, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ - 16, మెషినిస్ట్ - 12, మసూన్ (బిల్డింగ్ కన్‌స్ట్రక్టర్) - 9


విద్యార్హత వివరాలు.. 
విద్యార్హత వివరాలు పోస్టు విభాగం ఆధారంగా వేర్వేరుగా ఉన్నాయి. ఐటీఐ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాల్సి ఉంటుంది. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు డిప్లొమా ఇన్ మైనింగ్, డిప్లొమా ఇన్ మైనింగ్ అండ్ మైనింగ్ సర్వేయింగ్ ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వారు వీటికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ప్రతిభ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. 


స్టైఫండ్ వివరాలు.. 
ఒక ఏడాది ఐటీఐ అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ.7,700 స్టైఫండ్ అందిస్తారు. రెండేళ్ల ఐటీఐ అప్రెంటిస్ పోస్టుకు రూ.8,050, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుకు రూ.9,000, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుకు రూ.8,000 నెలవారీ స్టైఫండ్ ఇస్తారు. 


గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు ఇలా దరఖాస్తు చేయండి.. 



  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ , టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుకు దరఖాస్తు చేయడానికి https://portal.mhrdnats.gov.in/ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 

  • అనంతరం http://westerncoal.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

  • అప్లై చేసిన తర్వాత దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. 


ఐటీఐ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిలా.. 



  • https://apprenticeshipindia.org/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

  • అనంతరం http://westerncoal.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

  • దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక.. భవిష్యత్ అవసరాల కోసం ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Also Read: NHM AP Recruitment 2021: ఏపీలో 494 ఉద్యోగాలు.. రూ.1,10,000 వరకు జీతం.. ఈ నెల 15తో ముగియనున్న గడువు


Also Read: ITBP Recruitment 2021: ఐటీబీపీలో 553 ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. ముఖ్యమైన తేదీలివే..