WAPCOS Recruitment 2024: న్యూఢిల్లీలోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన వ్యాప్కోస్ ప్రాజెక్టుల్లో వాటర్ సప్లై ఎక్స్‌పర్ట్, స్ట్రక్చరల్ డిజైన్ ఎక్స్‌పర్ట్, మెకానికల్ డిజైన్ ఎక్స్‌పర్ట్, ఎలక్ట్రికల్ డిజైన్ ఎక్స్‌పర్ట్, కన్‌స్ట్రక్షన్ ఇంజినీర్, ఫీల్డ్ ఇంజినీర్/ సైట్ ఇంజినీర్(సివిల్&మెకానికల్) పోస్టులకు రెండు రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అభ్యర్థులు ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దీనిద్వారా మొత్తం 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 51
⏩ వాటర్ సప్లై ఎక్స్‌పర్ట్: 02 పోస్టులు
అర్హత: ఎంఈ/ ఎంటెక్(హైడ్రాలిక్స్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్/వాటర్ సప్లై ఎక్స్‌పర్ట్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి 60 సంవత్సరాలు మించకూడదు.
⏩ స్ట్రక్చరల్ డిజైన్ ఎక్స్‌పర్ట్: 01 పోస్టు
అర్హత: స్ట్రక్చర్ డిజైన్‌లో ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి 60 సంవత్సరాలు మించకూడదు.
⏩ మెకానికల్ డిజైన్ ఎక్స్‌పర్ట్: 02 పోస్టులు
అర్హత: బీఈ/ బీటెక్(మెకానికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి 60 సంవత్సరాలు మించకూడదు.
⏩ ఎలక్ట్రికల్ డిజైన్ ఎక్స్‌పర్ట్: 02 పోస్టులు
అర్హత: బీఈ/ బీటెక్(ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి 60 సంవత్సరాలు మించకూడదు.
⏩ కన్‌స్ట్రక్షన్ ఇంజినీర్: 04 పోస్టులు
అర్హత: బీఈ/ బీటెక్(సివిల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి 60 సంవత్సరాలు మించకూడదు.
⏩ ఫీల్డ్ ఇంజినీర్/ సైట్ ఇంజినీర్ (సివిల్): 37 పోస్టులు
అర్హత: బీఈ/ బీటెక్(సివిల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి 60 సంవత్సరాలు మించకూడదు.
⏩ ఫీల్డ్ ఇంజినీర్/ సైట్ ఇంజినీర్ (మెకానికల్): 3 పోస్టులు
అర్హత: బీఈ/ బీటెక్(మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి 60 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్: pmwapcosgnr@gmail.com
దరఖాస్తులకు చివరి తేదీ: 19.04.2024.
Notification
ALSO READ:
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎపుడంటే
AAI Recruitment 2024: న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్- 2024 స్కోరు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 1వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. గేట్ 2024 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.