AP DSC Notification: ఏపీలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2,721 ఉపాధ్యాయ పోస్టులకు పాఠశాల విద్య శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ముఖ్యాంశాలు
నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిసెంబర్ 14 నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 20 నుంచి జనవరి 13 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. డీఎస్సీ పరీక్షలను పూర్తిస్థాయిలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు సీబీటీ విధానంపై అవగాహన పెంచుకునేందుకు డిసెంబర్ 5 నుంచి ఆన్‌లైన్ మాక్‌టెస్టులు అందుబాటులో ఉంటాయి.ఈసారి క్రీడాకోటా అభ్యర్థులకు కూడా రాతపరీక్షను నిర్వహిస్తున్నారు.
కేటగిరీల వారీగా పోస్టులు
- మొత్తం 2,721 పోస్టుల విభజన ఇలా ఉంది.
- జనరల్ పాఠశాలలు (ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్)- 2,111 పోస్టులు
- స్పెషల్ ఎడ్యుకేషన్(ఎస్సీ, ఎస్టీ): 350 పోస్టులు
- సొసైటీలు & ఇతర యాజమాన్యాలు: 260 పోస్టులు Also Read: ఏబీవీకి బెజవాడ షాక్ - మేయర్ పోరులో డిపాజిట్ గల్లంతు.. ఇక పొలిటికల్ ఫ్యూచర్ ఉండేనా?
'కీ' విడుదల, అభ్యంతరాలు
పరీక్ష ముగిసిన రెండు రోజుల తర్వాత ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. ప్రాథమిక ‘కీ’పై అభ్యర్థులు అభ్యంతరాలను తెలియజేయడానికి వారం రోజుల గడువు ఇస్తారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం మరొక వారంలో తుది ‘కీ’ విడుదల చేస్తారు. పోస్టుల రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు, హారిజాంటల్ రిజర్వేషన్ వివరాలు, ఇతర నిబంధనలను అభ్యర్థుల కోసం త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. Also Read: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
