UPSC ISS Interview Schedule: యూపీఎస్సీ ఐఈఎస్, ఐఎస్ఎస్ (IES, ISS) 2023 ఇంటర్వ్యూ షెడ్యూలును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబరు 18న విడుదల చేసింది. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్(IES)/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) పరీక్ష ద్వారా ఇంటర్వ్యూకు ఎంపికైనవారు వెబ్‌సైట్‌లో షెడ్యూలును చూసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అభ్యర్థులకు డిసెంబరు 18 నుంచి ఐఈఎస్/ ఐఎస్ఎస్ అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ(Interview) నిర్వహించనున్నారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మొదటి సెషన్, మధ్యాహ్నం 1 గంట నుంచి రెండో సెషన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు సంబంధించి అభ్యర్థులకు ఈ-సమ్మాన్ లెటర్లను(కాల్ లెటర్) త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన షెడ్యూలు ప్రకారమే ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూలు మార్చుకునే వీల్లేదు.
ఇంటర్వ్యూ షెడ్యూలు ఇలా చెక్ చేసుకోండి..
➥ ఇంటర్వ్యూ షెడ్యూలు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. -https://upsc.gov.in/
➥ అక్కడ హోంపేజీలో 'What's New' సెక్షన్‌లోని "Interview Schedule: Indian Economic Service - Indian Statistical Service Examination, 2023." లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ ఇంటర్వ్యూ షెడ్యూలుకు సంబంధించిన పీడీఎఫ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
➥ అందులో పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ షెడ్యూలును చూసుకోవచ్చు.
➥ షెడ్యూలుకు సంబంధించిన పీడీఎఫ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
ఇప్పటివరకు డీఏఎఫ్ (DAF) సమర్పించని అభ్యర్థులు నిర్ణీత గడువులోగా సమర్పించాల్సి ఉంటుంది. సమర్పించని అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని రద్దుచేస్తారు. వారిని ఇంటర్యూకు ఎంపికచేయరు. ఇంటర్యూకు సంబంధించిన ఈసమ్మన్ లెటర్లను కూడా వారికి పంపించరు. ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థులకు రవాణా ఖర్చులు (ట్రైన్- సెకండ్/స్లీపర్ క్లాస్) చెల్లిస్తారు. ఇతర మార్గాల ద్వారా వచ్చినవారికి నిబంధనల ప్రకారం చెల్లిస్తారు. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను రూల్ నెంబర్, ఇంటర్వ్యూ తేదీ, సెషన్‌తో సహా అందుబాటులో ఉంచారు.
ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఫలితాలను యూపీఎస్సీ ఆగస్టు 24న విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్‌లో నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా మొత్తం 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన 124 మంది అభ్యర్థులకు డిసెంబరులో ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్టు నిర్వహించనున్నారు. ఇందులో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ పోస్టులకు 39 మంది అభ్యర్థులు, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పోస్టులకు సంబంధించి 85 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ అనంతరం ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ALSO READ:
ఎయిమ్స్ సంస్థల్లో 3,036 నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి, సి పోస్టులు, వివరాలు ఇలా
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలు కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ ఫర్ ఎయిమ్స్ (సీఆర్‌ఈ- ఎయిమ్స్) ద్వారా భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..