UPSC CSE Result 2025 | దేశంలోనే అత్యున్న సర్వీసులైన  UPSC CSE 2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ శుక్రవారం మధ్యాహ్నం రిలీజ్ చేశారు. అనూజ్ అగ్నిహోత్రి యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా నిలిచాడు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొత్తం 958 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జనరల్‌ కేటగిరీలో 317 మంది సెలక్ట్ కాగా, ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటా నుంచి 104 మంది, ఓబీసీ నుంచి 306 మంది, ఎస్సీ కేటగిరిలో 158, ఎస్టీ కేటగిరీ నుంచి 73 మంది పలు సర్వీసులకు ఎంపికయ్యారు. UPSC తన అధికారిక వెబ్‌సైట్‌లో సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫైనల్ రిజల్ట్స్ ప్రకటించింది. అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Continues below advertisement

అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వివరాలు నమోదు చేసి తమ ఫలితాలను చూడవచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా విజయం సాధించిన అభ్యర్థులు, వారి కుటుంబాల్లో ఆనందం నెలకొంది. ఇటీవల ఇంటర్వ్యూ నిర్వహించారు. పర్సనాలిటీ టెస్ట్ పాసైన అభ్యర్థుల మెరిట్ జాబితా తాజాగా విడుదల చేశారు. ఫలితాలు UPSC వెబ్‌సైట్‌లో http//www.upsc.gov.in లో కూడా అందుబాటులో ఉంటాయి. మార్కులనుఫలితం ప్రకటించిన తేదీ నుండి 15 రోజుల్లోపు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ టాపర్లు వీరే

Continues below advertisement
  1. అనూజ్ అగ్నిహోత్రి 
  2. రాజేశ్వరి సువె
  3. అకాన్ష్‌ ధూల్‌
  4. రాఘవ్‌ ఝున్‌ఝున్‌వాలా
  5. ఇషాన్‌ భట్నాగర్‌
  6. జిన్నియా అరోడా
  7. ఏఆర్‌ రాజా మొహియిద్దీన్‌
  8. పక్షల్‌ సెక్రటరీ
  9. అస్థా జైన్‌
  10. ఉజ్వల్‌ ప్రియాంక్‌

ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ విడుదల

UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష మూడు దశల్లో నిర్వహిస్తారు. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ మూడు దశలను ఉత్తీర్ణులైన తర్వాతే అభ్యర్థులను సివిల్ సర్వీసెస్ కు ఎంపిక చేస్తారు. ఈసారి ఇంటర్వ్యూ ప్రక్రియ జనవరి 2026 నుండి ప్రారంభమై ఫిబ్రవరి చివరి వారం వరకు కొనసాగింది. ఢిల్లీలోని ధోల్‌పూర్ హౌస్‌లో ఉన్న UPSC ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్‌కు మొత్తం 275 మార్కులు నిర్ణయించారు. ఈ మార్కులను మెయిన్స్ పరీక్ష మార్కులతో కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. 

మెరిట్ జాబితా అభ్యర్థుల ఎంపిక 

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్‌తో పాటు, ఇతర గ్రూప్ A, గ్రూప్ B సర్వీసుల్లో కూడా ఎంపికైన అభ్యర్థులను నియమిస్తారు.

పరీక్ష ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది?

UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష 2025 మొత్తం ప్రక్రియ చాలా నెలల పాటు కొనసాగింది. మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన తర్వాత అభ్యర్థులను ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్‌కు పిలిచారు. ఈ అన్ని దశల తర్వాత ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక సైట్‌ను సంప్రదించవచ్చు.

UPSC CSE 2025 ఫలితాన్ని ఇలా చెక్ చేయండి

దశ 1: మొదట UPSC అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ని సందర్శించాలి.

దశ 2: హోమ్‌పేజీలో కనిపించే UPSC CSE Result 2025 లింక్‌పై క్లిక్ చేయండి.

దశ 3: దీని తర్వాత రిజల్ట్స్ PDF మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

దశ 4: ఈ PDFలో అభ్యర్థులు తమ రోల్ నంబర్ లేదా పేరును సెర్చ్ చేసి ఫలితాన్ని చూడవచ్చు.

అభ్యర్థుల EWS/ OBC/ SC/ ST, PwBD కింద వారి రిజర్వేషన్ కు సంబంధించిన క్లెయిమ్‌లు సంబంధిత అధికారుల వెరిఫికేషన్‌కు లోబడి ఉంటాయి. సిఫార్సు చేసిన 348 మంది అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని తాత్కాలికంగా హోల్డ్ చేశారు. ఇద్దరు అభ్యర్థుల ఫలితాలను నిలిపివేశారు. UPSC తన క్యాంపస్‌లోని పరీక్షా హాల్ దగ్గర “ఫెసిలిటేషన్ కౌంటర్”లో అభ్యర్థులు తమ పరీక్షలు / నియామకాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని వర్కింగ్ డేస్ లో ఉదయం 10:00 గంటల నుండి 5:00 గంటల మధ్య స్వయంగా లేదా టెలిఫోన్ నంబర్లు 23385271 / 23381125 / 23098543 ద్వారా పొందవచ్చు.