యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన నాన్-టీచింగ్, అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబరు 30లోగా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించి, అక్టోబరు 6లోగా దరఖాస్తు హార్డ్ కాపీలను నిర్ణీత చిరునామాకు చేరేలా పంపాలి.
వివరాలు..
* మొత్తం పోస్టుల సంఖ్య: 95
➥ డిప్యూటీ రిజిస్ట్రార్ (డిప్యూటేషన్)- 1
➥ అసిస్టెంట్ లైబ్రేరియన్- 4
➥ అసిస్టెంట్ రిజిస్ట్రార్- 2
➥ సెక్షన్ ఆఫీసర్- 2
➥ అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్)- 02
➥ సెక్యూరిటీ ఆఫీసర్- 2
➥ సీనియర్ అసిస్టెంట్- 2
➥ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 1
➥ జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్)- 8
➥ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్- 1
➥ జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 2
➥ స్టాటిస్టికల్ అసిస్టెంట్- 1
➥ ఆఫీస్ అసిస్టెంట్- 10
➥ లైబ్రరీ అసిస్టెంట్- 4
➥ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్- 44
➥ హిందీ టైపిస్ట్- 1
➥ ల్యాబొరేటరీ అటెండెంట్- 8
అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: పోస్టులవారీగా 32 - 56 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
THE ASSISTANT REGISTRAR
RECRUITMENT CELL, ROOM NO: 221, FIRST FLOOR
ADMINISTRATION BUILDING, UNIVERSITY OF HYDERABAD
PROF. C.R. RAO ROAD, CENTRAL UNIVERSITY P.O.,
GACHIBOWLI, HYDERABAD – 500 046, TELANGANA, INDIA
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరితేది: 30.09.2023.
➥ దరఖాస్తు హార్డ్‌కాపీల సమర్పణకు చివరితేది: 06.10.2023.
ALSO READ:
ఇండియన్ కోస్ట్ గార్డులో 350 నావిక్, యాంత్రిక్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 8న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 22లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, అసెస్‌మెంట్ అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ.21,700; యాంత్రిక్ పోస్టులకు బేసిస్ పే రూ.29,200 చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 34 ఇంజినీర్ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎస్) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 16, 17 తేదీల్లో వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, లేదా పీజీ అర్హత ఉన్నవారు వాక్-ఇన్‌కు హాజరుకావచ్చు. అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూరించి, అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలను నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..