CDSE(2) 2023 Final Results: కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(CDSE-2)-2023 తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC) జూన్ 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. తుది ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలనతో పాటు తదిపరి పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 271 మంది తదుపరి పరీక్షలకు ఎంపికయ్యారు. ఇందులో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (మెన్)కు 204 మంది, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఉమెన్)కు 67 మంది ఎంపికయ్యారు. ప్రభుత్వం 120 షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు (మెన్)కు 169 పోస్టులను, 34వ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు (ఉమెన్)కు 16 పోస్టులను కేటాయించిన సంగతి తెలిసిందే.

  


యూపీఎస్సీ సీడీఎస్(2) - 2023 తుది ఫలితాలు ఇలా చూసుకోండి..


➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- https://www.upsc.gov.in/


➥ అక్కడ్ హోంపేజీలో కనిపించే 'Final Result: Combined Defence Services Examination (II), 2023 (OTA)' లింక్ పై క్లిక్ చేయాలి.


➥ ఫలితాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతోంది. 


➥ అక్కడ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుటులో ఉన్న ఫలితాలు కనిపిస్తాయి.


➥ 'Ctrl + F' క్లిక్ చేసి హాల్‌టికెట్ లేదా రూల్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చేసుకోవచ్చు. నెంబర్ వస్తే అర్హత సాధించినట్లు లేకపోతే అర్హత లేనట్టే. 


➥ ఆ పీడీఎఫ్ ఫైల్‌లో అభ్యర్థులు తుది ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.


➥ ఫలితాలతో కూడిన పీడీఎఫ్‌ను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం భద్ర పర్చుకోవాలి.


యూపీఎస్సీ సీడీఎస్(2) - 2023 (OAT) తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..


అభ్యర్థులు మార్కుల వివరాలను 15 రోజుల్లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 011-23385271, 011-23381125, 011-23098543 ఫోన్ నెంబర్లలో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్య సంప్రదించవచ్చు. 


ఇండియన్‌ మిలటరీ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీలలో నియామకానికి గతేడాది సెప్టెంబరు 3న యూపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. త్రివిధ ద‌ళాల్లోని వివిధ విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి సంబంధిచిన సీడీఎస్‌ ఎగ్జామ్‌ను యూపీఎస్సీ ఏటా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్‌ ఇంటెల్లిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల అధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే యూపీఎస్సీ ప్రస్తుతం విడుదల చేసిన మెరిట్ జాబితాలో మెడికల్ టెస్టును పరిగణనలోకి తీసుకోలేదు. ఎంపికైన అభ్యర్థులకు ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షలు నిర్వహించనుంది.


కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేష‌న్(II)-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మే 17న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి మే 17 నుంచి జూన్ 6 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఫర్‌ ఇంటెల్లిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల అధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.


నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..