యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ సంస్థల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 13లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 69.
అర్హత:
➥ రీజినల్ డైరెక్టర్: 01
అర్హత: ఎంఎస్సీ (మైక్రోబయాలజీ/ వృక్షశాస్త్రం/ ప్లాంట్ పాథాలజీ/ మైకాలజీ) ఉత్తీర్ణత.
వయోపరిమితి: 55 సంవత్సరాలు ఉండాలి.
➥ అసిస్టెంట్ కమిషనర్: 01
అర్హత: మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 40 సంవత్సరాలు ఉండాలి.
➥ అసిస్టెంట్ ఓర్ డ్రెస్సింగ్ ఆఫీసర్: 22
అర్హత: డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 35 సంవత్సరాలు ఉండాలి.
➥ అసిస్టెంట్ మినరల్ ఎకనామిస్ట్: 04
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 35 సంవత్సరాలు ఉండాలి.
➥ అసిస్టెంట్ మైనింగ్ ఇంజినీర్: 34
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 30 సంవత్సరాలు ఉండాలి.
➥ యూత్ ఆఫీసర్: 07
అర్హత: మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 30 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది:13.04.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు కాపీ ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 14.04.2023.
Also Read:
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 138 ఇంజినీర్ ట్రెయినీ ఖాళీలు- అర్హతలివే!
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 138 ఇంజినీర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..