Union Bank of India SO Recruitment: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (Specialist Officers) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 606 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 3 నుంచి 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.


వివరాలు..


🔰 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 606.


పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్)-253, ఈడబ్ల్యూఎస్-59, ఓబీసీ-161, ఎస్టీ-44, ఎస్సీ-89.


1) చీఫ్ మేనేజర్ (ఐటీ): 05 పోస్టులు


2) సీనియర్ మేనేజర్ (ఐటీ): 42 పోస్టులు


3) మేనేజర్ (ఐటీ): 04 పోస్టులు


4) మేనేజర్ (రిస్క్): 27 పోస్టులు


5) మేనేజర్ (క్రెడిట్): 371 పోస్టులు


6) మేనేజర్ (లా): 25 పోస్టులు


7) మేనేజర్ (ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్): 05 పోస్టులు


8) మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్): 19 పోస్టులు


9) అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజినీర్): 02 పోస్టులు


10) అసిస్టెంట్ మేనేజర్ (సివిల్ ఇంజినీర్): 02 పోస్టులు


11) అసిస్టెంట్ మేనేజర్ (ఆర్కిటెక్ట్): 01 పోస్టు 


12) అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్): 30 పోస్టులు


13) అసిస్టెంట్ మేనేజర్ (ఫోరెక్స్): 73 పోస్టులు


అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో బీఎస్సీ/బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ/ సీఏ/సీఎంఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎస్/ సీఎఫ్‌ఏ సర్టిఫికేట్/ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి..


➥ చీఫ్ మేనేజర్(ఐటీ) పోస్టులకు 30 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి. 


➥ సీనియర్ మేనేజర్(ఐటీ) పోస్టులకు 28 - 38 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ సీనియర్ మేనేజర్(రిస్క్/సీఏ) పోస్టులకు 25 - 35  సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ మేనేజర్ (ఐటీ/క్రెడిట్/ఐటీవో/టీవో) పోస్టులకు 25 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ మేనేజర్ (రిస్క్/లా) పోస్టులకు 25 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి.  


➥ అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజినీర్/సివిల్ ఇంజినీర్/ఆర్కిటెక్ట్/టెక్నికల్/ఫోరెక్స్) పోస్టులకు 20 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.  


➥ ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు చెందినవారికి  5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన, ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.


ALSO READ: ఐసీఐసీఐ బ్యాంకులో పీవో పోస్టులు - కోర్సు, స్టైపెండ్ వివరాలు ఇవే


పరీక్ష విధానం..


➥ మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.


➥ అయితే అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-25 ప్రశ్నలు-25 మార్కులు, రీజనింగ్- 50 ప్రశ్నలు-50 మార్కులు, అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 50 ప్రశ్నలు-100 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్- 25 ప్రశ్నలు-25 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు.


➥ పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కులు కోత విధిస్తారు.


పర్సనల్ ఇంటర్వ్యూ: రాతపరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తం 50 మార్కులు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25గా నిర్ణయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 22.5గా నిర్ణయించారు. నిర్ణీత అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 1: 3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.


గ్రూప్ డిస్కషన్: మొత్తం 50 మార్కులకు గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25గా నిర్ణయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 22.5గా నిర్ణయించారు. 


పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ ఎన్‌సీఆర్, హైదరాబాద్, చండీగఢ్/మొహాలీ, బెంగళూరు, లక్నో, చెన్నై, కోల్‌కతా, భోపాల్, పాట్నా, ముంబయి/నేవీ ముంబయి/గ్రేటర్ ముంబయి/థానే, భువనేశ్వర్, అహ్మదాబాద్/గాంధీనగర్.


జీత భత్యాలు..


➥ చీఫ్ మేనేజర్ పోస్టులకు రూ.76,010-రూ.89,890 వరకు ఉంటుంది. 


➥ సీనియర్ మేనేజర్ పోస్టులకు రూ.63840-రూ.78,230 వరకు ఉంటుంది. 


➥ మేనేజర్ పోస్టులకు రూ.48,170-రూ.69,810 వరకు ఉంటుంది.  


➥ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.36,000-రూ.63,840 వరకు ఉంటుంది.  


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.02.2024


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 23.02.2024 (24:00 Hrs).


Notification


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..