సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) పరిధిలో ఖాళీగా ఉన్న 1553 జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పదోతరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 8 నుంచి మార్చి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 1553


* జూనియర్ లైన్‌మెన్ పోస్టులు


* లిమిటెడ్ రిక్రూట్‌మెంట్(LR): 553; జనరల్ రిక్రూట్‌మెంట్(GR): 1000.


అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) అర్హత ఉండాలి.


వయోపరిమితి: 01.01.2023 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.  


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాతపరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. వీటిలో 80 మార్కులు రాతపరీక్షకు, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టీషియన్స్, ఔట్‌సోర్సింగ్ అభ్యర్థులకు 20 మార్కుల వెయిటేజీ వర్తిస్తుంది.


పరీక్ష విధానం: మొత్తం 80 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 80 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్షలో రెండు సెక్షన్లు (సెక్షన్-ఎ, సెక్షన్-బి) ఉంటాయి. సెక్షన్-ఎ (కోర్ ఐటీఐ సబ్జెక్ట్) నుంచి 65 ప్రశ్నలు, సెక్షన్-బి (జనరల్ నాలెడ్జ్) నుంచి 15 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో కనీస అర్హత మార్కులకు ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 % (40 మార్కులు), బీసీ అభ్యర్థులకు 35 % (35 మార్కులు), ఎస్సీ-ఎస్టీ  అభ్యర్థులకు 30 % (30 మార్కులు) గా నిర్ణయించారు. 


సిలబస్ వివరాలు..


జీతభత్యాలు: నెలకు రూ. 24,340 – 39,405 చెల్లిస్తారు.


పరీక్ష కేంద్రాలు: జీహెచ్‌ఎంసీ/హెచ్‌ఎండీఏ పరిధిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.


ముఖ్యమైన తేదీలు..


➽ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభతేదీ: 08.03.2023.


➽ దరఖాస్తు చేయడానికి చివరితేదీ: 28.03.2023.


➽ అప్లికేషన్ సవరణ తేదీలు: 01.04.2023 నుండి 04.04.2023 వరకు


➽ హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్:  24.04.2023.


➽ పరీక్ష తేదీ: 30.04.2023.
Notification


Website 



Also Read:


TSPSC Exams: టీఎస్‌పీఎస్సీ పరీక్షల తేదీలు ఖరారు, షెడ్యూలు ఇలా!
రాష్ట్రంలో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 15న వెల్లడించింది. వీటిలో పశుసంవర్థక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు మార్చి 15, 16 తేదీల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,151 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో వీరికి రాత పరీక్ష నిర్వహించనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


టీఎస్‌పీఎస్సీకి 'పరీక్షా' సమయం, నియామక పరీక్షల తేదీలపై తర్జనభర్జన..
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో వరసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పరీక్షల తేదీల రూపంలో పెద్ద చిక్కొచ్చిపడింది. ఉద్యోగ నియామక పరీక్షల తేదీలకు సంబంధించి తర్జనభర్జన పడుతోంది. టీఎస్‌పీఎస్సీకే పెద్ద పరీక్షగా మారింది. ఈ ఏడాది డిసెంబరు వరకు వివిధ పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలతో శని, ఆదివారాలు బిజీగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...