తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల వివిధ విభాగాల్లో 1946 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో ములుగు జిల్లాలో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ & రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 27 టీచింగ్ పోస్టులు, ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులు, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో 23 ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాలు, వివిధ విభాగాల్లో 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. త్వరలోనే దరఖాస్తు గడువు ముగియనుంది.. ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి..



పోస్టుల వివరాలు..



1) ములుగు ఫారెస్ట్ కాలేజీలో 27 టీచింగ్ పోస్టులు (చివరితేది: 27-09-2022)

తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ & రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 27 పోస్టులను భర్తీచేయనున్నారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 6 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుకింద రూ.500 చెల్లించి సెప్టెంబరు 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారానే పరీక్ష ఫీజు చెల్లించాలి. 

నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..  




2) తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమశాఖలో 181 ఉద్యోగాలు (చివరితేది: 29.09.2022)

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. సెప్టెంబరు 8 నుంచి 29 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..





3) టీఎస్‌పీఎస్సీ నుంచి 23 ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు (చివరితేది: 10-10-2022)


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


4) తెలంగాణ మున్సిపల్‌ శాఖలో 175 ఉద్యోగాలు (చివరితేది: 13-10-2022)

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.

నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..



5) తెలంగాణలో 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్ పోస్టులు (చివరితేది: 14-10-2022 )
తెలంగాణ స్టేట్ ​పబ్లిక్ ​సర్వీస్​ కమిషన్ ​మరో భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్​15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మిష‌న్ భ‌గీర‌థ‌, ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్‌, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భ‌ర్తీ చేయనున్నారు. 

నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...