తెలంగాణ‌లో ఉద్యోగాల జాత‌ర కొన‌సాగుతూనే ఉంది. ఇప్పటికే ప‌లు ఉద్యోగ నోటిఫికేష‌న్లు వెలువ‌డ‌గా, తాజాగా మ‌రో రెండు నోటిఫికేష‌న్లు విడుద‌లయ్యాయి. వెట‌ర్నరీ, హార్టిక‌ల్చర్ డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న 207 ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసింది. వీటిలో వెటర్నరీ విభాగంలో 185 వెట‌ర్నరీ అసిస్టెంట్ స‌ర్జన్ పోస్టుల‌ు ఉండగా, హార్టిక‌ల్చర్ విభాగంలో 22 హార్టిక‌ల్చర్ ఆఫీస‌ర్ పోస్టులు ఉన్నాయి. 


వెట‌ర్నరీ అసిస్టెంట్ స‌ర్జన్ పోస్టుల‌కు డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరి 19 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ు స్వీక‌రించ‌నున్నారు. ఇక హార్టిక‌ల్చర్ ఆఫీస‌ర్ ఉద్యోగాల‌ భర్తీకి జ‌న‌వ‌రి 3 నుంచి 24 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీకరించనున్నారు. 




*********************************************************************************************************************


త్వరలో గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లు..
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ మరో వారంలో వెలువడే అవకాశం ఉంది. తర్వాత వారం నుంచి రెండు వారాల వ్యవధిలో గ్రూప్ -3 నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. గ్రూప్ -2లో భాగంగా 726 ఉద్యోగాలు, గ్రూప్ -3లో 1,373 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. గతంలో గ్రూప్-2లో 663 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వగా.. తాజా చేర్పుల అనంతరం ఆ సంఖ్య 726కు చేరింది. ప్రభుత్వం గ్రూప్-2లో మరో 6 రకాల పోస్టులు రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఎఎస్‌ఒ, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులును చేర్చింది.


అలాగే గ్రూప్-3లో గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్, హెచ్‌ఒడిల్లోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను చేర్చింది. గతంలో ప్రభుత్వం ప్రభుత్వం అనుమతించిన పోస్టులకు అదనంగా తాజాగా అనుమతించిన పోస్టులను కలిపి కమిషన్ ప్రకటనలు జారీ చేయనున్నది. కొత్తగా అనుమతించిన పోస్టులకు సంబంధించి ప్రభుత్వ విభాగాల నుంచి కమిషన్‌కు ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి. అదనంగా చేర్చినవాటితో కలిపి త్వరలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. 


ఇప్పటికే గ్రూప్ 4, జేఎల్ పోస్టులకు నోటిఫికేషన్లు..
రాష్ట్రంలో ఇప్పటికే 9,168 గ్రూప్- 4 పోస్టులు, 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-4 ఉద్యోగాలకు డిసెంబరు 23 నుంచి జనవరి 12 వరకు, జేఎల్ పోస్టులకు డిసెంబరు 20 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. అలాగే రాష్ట్రంలో 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు, 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, భూగర్భ జలవనరుల శాఖలో 57 పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసింది. వీటి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.


Also Read:


సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల తుది జాబితా విడుదల, ఇక్కడ చెక్ చేసుకోండి!


డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!


పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...