తెలంగాణలో 'గ్రూప్-4' ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ సోమవారం (ఆగస్టు 28) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. గ్రూప్-4 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది.
ప్రిలిమినరీ కీతోపాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, మాస్టర్ క్వశ్చన్ పేపర్‌ను కూడా వెబ్‌సైట్‌లో కమిషన్ అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ 27 వరకు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉంటాయని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు.
Question Papers and Preliminary Key
ప్రిలిమనరీ కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే కమిషన్ వెబ్‌సైట్ ద్వారా తెలియజేయాలని సూచించారు. అభ్యర్థులు నేరుగా, పోస్టు లేదా మెయిల్ ద్వారా తెలిపిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అభ్యంతరాలకు సంబంధించి ఆధారాలను తప్పనిసరిగా పీడీఎఫ్ ఫార్మట్‌లో జతచేయాలని తెలిపారు. గ్రూప్-4 ఫలితాలను అక్టోబర్ నెలలో ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తుంది.
రాష్ట్రంలో వివిధ విభాగాల్లో గ్రూప్-4 కేటగిరీలో 8,039 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 1న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 9,51,205 మంది దరఖాస్తు చేశారు. జులై 1న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు సంబంధించి.. పేపర్-1కు 7,63,835 మంది, పేపర్-2కు 7,61,026 మంది హాజరయ్యారు.
ALSO READ:
నిరుద్యోగులకు బిగ్ గుడ్‌న్యూస్! ఏపీలో గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2లో 597 పోస్టుల భర్తీకి ఈ మేరకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ శాఖలు, సచివాలయంలో పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆగస్టు 28న అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం పోస్టుల్లో గ్రూప్-1 పరిధిలో 89 పోస్టులు, గ్రూప్-2 పరిధిలో 508 పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ పరీక్షలను నిర్వహించనుంది. ఏపీలో 597 గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, గ్రూప్-1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగిరి-2, అసిస్టెంట్ కమిషనర్(ఎస్టీ), అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులతో సహా పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
అంగన్వాడీలకు గుడ్‌న్యూస్, కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం-విషయం ఏంటంటే?
తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,989 మినీ అంగన్వాడీలను కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచింది. ఉద్యోగ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది. అదేవిధంగా మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగ విరమణ తర్వాత టీచర్లు, హెల్పర్లకు ఆసరా పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీల స్థాయి పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.