TSPSC Accounts Officers Results: తెలంగాణ పురపాలకశాఖలో అకౌంట్స్ ఆఫీసర్స్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్, సీనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఫలితాలను టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 21న విడుదల చేసింది. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. జనరల్ ర్యాంకింగ్ జాబితాలో మొత్తం 12,186 మంది అభ్యర్థులకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచారు. దీనిప్రకారం త్వరలోనే మెరిట్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.


అభ్యర్థులు జనరల్ ర్యాంకింగ్ జాబితా కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గతేడాది డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 78 పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో అకౌంట్స్ ఆఫీసర్-01, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-13, సీనియర్ అకౌంటెంట్-64 పోస్టులు ఉన్నాయి. కామర్స్  డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఈ ఏడాది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరించారు.  


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం గతేడాది ఆగస్టు 8న ఈ పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించారు. రాతపరీక్ష ప్రాథమిక ఆన్సర్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 21న విడుదల చేసింది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 25 వరకు ఆన్సర్ కీపై అభ్యతరాలు స్వీకరించింది. తదనంతరం ఫిబ్రవరి 12న తుది ఆన్సర్ కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి 21న ఫలితాలను విడుదల చేసింది. 


పోస్టుల వివరాలు..


ఖాళీల సంఖ్య: 78


1) అకౌంట్స్ ఆఫీసర్: 01


2) జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్: 13


3) సీనియర్ అకౌంటెంట్: 64 


పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (కామర్స్ - డిగ్రీ స్థాయి): 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులోనూ, పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.


జీతం: 


⏩ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు రూ.45,960 - రూ.1,24,150.


⏩ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు రూ.42,300 - రూ.1,15,270.


⏩ సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ.32,810 - రూ.96,890.


ALSO READ:


టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ పరీక్షలు, జనరల్‌ ర్యాంకుల జాబితా రూపకల్పనలో మార్పులు
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్షల ఆధారంగా జనరల్ ర్యాంకుల జాబితాల (GRL) రూపకల్పనలో కమిషన్ మార్పులు చేసింది. 2023 సెప్టెంబరు 20 జారీచేసిన మార్గదర్శకాలకు సవరణలు చేసింది. అభ్యర్థులు రాత పరీక్షలో సమాన మార్కులు సాధించినపుడు ర్యాంకుల ఖరారులో అవలంబించాల్సిన విధానంపై స్పష్టత ఇచ్చింది. 2022 ఏప్రిల్ నుంచి టీఎస్‌పీఎస్సీ వెలువరించిన అన్ని నోటిఫికేషన్లకు ఈ విధానం వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ అధికారిక ప్రకటన విడుదలచేశారు. దీనిప్రకారం టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఏదైనా పరీక్షలో ఇద్దరి కంటే ఎక్కువ మందికి సమాన మార్కులొస్తే.. అభ్యర్థి స్థానికత ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. స్థానికత కలిగిన వారికి ఉన్నత ర్యాంకు, తెలంగాణేతరులకు ఆ తరువాత వచ్చే ర్యాంకు కేటాయిస్తారు. 
టీఎస్‌పీఎస్సీ రూపొందించిన కొత్త మార్గదర్శకాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...