Group-2 Application Edit: 'గ్రూప్-2' అభ్యర్థుల‌కు అల‌ర్ట్, ద‌ర‌ఖాస్తుల సవరణకు మరో అవకాశం

TSPSC Group2: తెలంగాణలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తుల సవరణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవకాశం కల్పించింది. తప్పులుంటే ఎడిట్‌ చేసుకోవచ్చు.

Continues below advertisement

Editing Group-2 Applications Online: తెలంగాణలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు TGPSC కీలక సూచన చేసింది. దరఖాస్తుల సమయంలో నమోదుచేసిన వివరాలల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చని వెల్లడించింది. అభ్యర్థులకు జూన్ 16 నుంచి 20న సాయంత్రం 5 గంటల వరకు 'ఎడిట్‌' ఆప్షన్‌ (Group-2 Application Edit) అందుబాటులో ఉంటుందని టీజీపీఎస్సీ జూన్ 14న ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తుల సవరణకు ఇదే చివరి అవకాశమని, మరోసారి అవ‌కాశం ఉండ‌ద‌ని స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఏమైనా త‌ప్పిదాలు చేస్తే స‌రిచేసుకోవాల‌ని సూచించింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకున్న తర్వాత త‌ప్పనిస‌రిగా పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని కమిషన్ సూచించింది. గతేడాది జులై 8 నుంచి 12 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అవకాశం కల్పించారు.

Continues below advertisement

రాష్ట్రంలో 783 గ్రూప్-2 ఖాళీల (Group2 Posts) భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022-డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈ ఉద్యోగాలకు మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు (Group2 Applications) దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది చొప్పున పోటీ నెలకొంది. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

ALSO READ: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలు విడుదల, పేపర్లవారీగా తేదీలివే

 

* గ్రూప్-2 పోస్టుల వివరాలు

మొత్తం ఖాళీల సంఖ్య: 783

1) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11 పోస్టులు

2) అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59 పోస్టులు

3) నాయబ్ తహసిల్దార్: 98 పోస్టులు

4) సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14 పోస్టులు

5) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63 పోస్టులు

6) అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09 పోస్టులు

7) మండల్ పంచాయత్ ఆఫీసర్: 126 పోస్టులు

8) ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97 పోస్టులు

9) అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38 పోస్టులు

10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165 పోస్టులు

11) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15 పోస్టులు

12) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25 పోస్టులు

13) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07 పోస్టులు

14) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు

15) డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11 పోస్టులు

16) అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

17) అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09 పోస్టులు

18) అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
గ్రూప్-2 మొత్తం 600 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు చొప్పున నాలుగు పేపర్లకు కలిపి 600 ప్రశ్నలకు 600 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు. 

➥ పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు.

➥ పేపర్-3 (ఎకానమీ & డెవలప్‌మెంట్): 150 ప్రశ్నలు-150 మార్కులు.

➥ పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతారణ): 150 ప్రశ్నలు-150 మార్కులు.  

గ్రూప్-2 నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement