తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేయాలని భావిస్తోంది. మునుగోడు ఎన్నికకు సమయం దగ్గర పడుతుండటంతో ఇక నోటిఫికేషన్ల ప్రకటనకు ఇటు ప్రభుత్వం, అటు టీఎస్‌పీఎస్‌సీ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 3న ఎన్నికలు, 6న ఫలితాల వెల్లడితో మునుగోడు ఎన్నికల పర్వం పూర్తవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైనా గ్రూప్-2 లేదా గ్రూప్-4, ఇతర నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు ప్రకటించడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూడు నాలుగు నెలల గ్యాప్‌తో వరుసగా గ్రూప్-2, 4తో పాటు మిగతా ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించేందుకు టీఎస్‌పీఎస్‌సీ కార్యచరణ సిద్దం చేసుకుంటోంది.
రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 80,039 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు ఆర్థికశాఖ అనుమతులు పొందిన పోస్టుల సంఖ్య దాదాపు 53వేల వరకు ఉంది. ఇందులో దాదాపు 21500 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ, పోలీస్‌రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్లు ఇప్పటికే ఇచ్చేశాయి. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష పూర్తి కాగా, ఇంకా ఈవెంట్స్ జరగాల్సి ఉంది. అలాగే టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఇంకా జరగాల్సి ఉంది. మరోవైపు ఆర్థికశాఖ అనుమతులు పొందిన గురుకుల, గ్రూప్- 2, 3, 4 ఇతర నోటిఫికేషన్లు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే గిరిజనులకు 10 శాతానికి రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేయండంతో దానికనుగుణంగా రోస్టర్ పాయింట్ల వారీగా పోస్టులను ఖరారు చేసే పనిలో అధికారులు ఉన్నారు.
నిరుద్యోగుల ఎదురుచూపు..
రాష్ట్రంలో 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు ఆశగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన దానిప్రకారం 53 వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతిచ్చినా.. నోటిఫికేషన్లు మాత్రం ఆలస్యంగా వెలువడుతున్నాయి. ఒక్కో నోటిఫికేషన్‌కు మధ్య చాలా గ్యాప్ ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే నిరుద్యోగులు మాత్రం ఆలస్యంగా నోటిఫికేషన్లను జారీ చేయడం ద్వారా నిరాశకు గురవుతున్నారు. సెప్టెంబరులో ఏదైనా ఓ భారీ నోటిఫికేషన్ వెలువడుతుందని నిరుద్యోగులు భావించారు. లేదా దసరా పండుగ ముందైనా విడుదల చేస్తారని నిరుద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వెలువడలేదు. శాఖల వారీగా పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతినిస్తూ వస్తోంది.
ఇప్పటివరకు వచ్చినవివే!
పోలీస్ రిక్య్రూట్‌మెంట్ బోర్డు అధ్వర్యంలో 17వేల పైచిలుకు పోస్టులు, టీఎస్‌పీఎస్‌సీ దాదాపు 2600 ఉద్యోగాలు, ఇతర పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్లు ఇప్పటికే జారీ అయ్యాయి. ఇంకా సుమారు 31 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇటీవల ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లకు కాస్త బ్రేక్‌పడినట్లయింది. రోస్టర్ పాయింట్ల వారిగా మార్చుతూ ఇక నోటిఫికేషన్లు పడే అవకాశం ఉంది.
:: ALSO READ ::
✦ AP High Court Jobs: హైకోర్టులో 36 టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులు, అర్హతలివే!
✦ AP High Court Jobs: హైకోర్టులో డ్రైవర్ పోస్టులు, వివరాలు ఇలా!
✦ AP High Court Jobs: హైకోర్టులో ఓవర్‌సీర్ పోస్టులు, అర్హతలివే
✦ AP High Court Jobs: హైకోర్టులో అసిస్టెంట్ ఓవర్‌సీర్ పోస్టులు, అర్హతలివే!
✦ AP High Court Jobs: హైకోర్టులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
✦ AP High Court Jobs: హైకోర్టులో 135 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, అర్హతలివే!
✦ AP High Court Jobs: హైకోర్టులో 27 అసిస్టెంట్, ఎగ్జామినర్ ఉద్యోగాలు
✦ AP High Court Jobs: ఏపీ హైకోర్టులో ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
✦ AP High Court Jobs: హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు, ఈ అర్హతలు ఉండాలి!