తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలు అక్టోబరు 26న విడుదలయ్యాయి. ఎస్‌ఐ, కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్స్, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్ కానిస్టేబుల్స్‌ ప్రాథమిక పరీక్షల ఫలితాలను తెలంగాణ స్టేట్‌ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. ఫలితాలతోపాటు కానిస్టేబుల్, ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని కూడా మండలి విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను ఫైనల్ కీని అందుబాటులో ఉంచింది. ఫలితాల కోసం అభ్యర్థులు తమ మొబైల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలను నమోదుచేయాల్సి ఉంటుంది. 


ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..



ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత శాతం ఇలా..


ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాల్లో మొత్తం 41.67 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఎస్‌ఐ పోస్టులకు 2,25,668 మంది రాత పరీక్ష రాయగా, 1,05,603(46.80 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. సివిల్ కానిస్టేబుల్‌ పోస్టులకు 5,88,891 మంది రాత పరీక్ష రాయగా, 1,84,861(31.39 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ పోస్టులకు 41,835 మంది రాత పరీక్ష రాయగా, 18,758(44.84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 2,50,890 మంది రాత పరీక్ష రాయగా, 1,09,518(43.65 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.


కానిస్టేబుల్, ఎస్‌ఐ ఫలితాల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఫైనల్ కీలు ఇలా..


కానిస్టేబుల్, ఎస్‌ఐ,  OMR ఆన్సర్ షీట్ల కోసం క్లిక్ చేయండి.. 


కానిస్టేబుల్ ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి..



ఎస్‌ఐ ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి..


ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ ఫైనల్ కీ


ప్రొహిబిషన్&ఎక్సైజ్ కానిస్టేబుల్ ఫైనల్ కీ


నవంబరులో ఫిజికల్ టెస్టులు...
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫలితాల్లో అర్హత సాధించే అభ్యర్థులకు నవంబరులో ఫిజికల్ ఎఫిషియెన్సీ, మెజర్‌మెంట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పంపించే లేఖల్లోనే వాటిని నిర్వహించే వేదిక, పరీక్ష తేదీ వివరాలను నియామక మండలి వెల్లడించనుంది.


ఈవెంట్లు ఇలా..
ఫిజికల్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులకు మొదట పరుగు పందెం నిర్వహిస్తారు. పురుషులు 1,600 మీటర్లు, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో పరుగు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో లాంగ్‌జంప్‌, షాట్‌పుట్ పోటీలు నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ అర్హత సాధిస్తేనే తుది రాతపరీక్షకు అర్హులుగా పరిగణిస్తారు. వీరికి మాత్రమే ఫైనల్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జారీ చేసి, పరీక్ష నిర్వహిస్తారు.


రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్‌ఐ పోస్టులకు  ఆగస్టు 7న, అలాగే 16,321 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆగస్టు 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎస్‌ఐ రాతపరీక్షకు 2,47,217 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక కానిస్టేబుల్ పరీక్షకు మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు.


 


:: Also Read ::


నిజామాబాద్ ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టులో వివిధ ఉద్యోగాలు, అర్హతలివే!
నిజామాబాద్‌లోని ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్ కోర్టు(పోక్సో)లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టుని అనుసరించి విద్యర్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు నిజామాబాద్ జిల్లాకు చెందినవారై ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..


 


ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో 632 ఖాళీలు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్, టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 19 నుంచి నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...