తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి నిర్ణయాలతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగాల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకున్న ఈ తరుణంలో కొందరు అభ్యర్థుల అభ్యర్థిత్వం చెల్లదంటూ మండలి తిరస్కరించడం వారికి చేదు అనుభవాన్ని మిగులుస్తోంది.


ప్రాథమిక రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాతపరీక్షల్లో నెగ్గుకొచ్చిన తర్వాత ఇప్పుడు అభ్యర్థిత్వం చెల్లదనడం ఏంటంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే వారి వయసు మీరడమే ఇందుకు కారణమని మండలి చెబుతుండగా.. తొలి దశలోనే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని తిరస్కారానికి గురైన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈమేరకు మండలికి వినతులు వెల్లువెత్తుతున్నాయి.


వాస్తవానికి మండలి జారీ చేసిన నోటిఫికేషన్‌లో అభ్యర్థుల వయసు అర్హతల గురించి స్పష్టంగా పేర్కొన్నారు. నిర్ణీత వయసుకు లోబడినవారే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. దరఖాస్తు సమయంలోనే ధ్రువీకరణ పత్రాల్ని వడబోయడం శ్రమతో కూడుకున్నది కావడంతో వయసు సహా అన్ని ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను మండలి చివరలో చేపట్టింది. అదే ఇప్పుడు సమస్యకు కారణమైంది. నిర్ణీత వయసు లేనివారు దరఖాస్తు చేసినప్పుడే తిరస్కరణకు గురైతే ఇబ్బంది ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ALSO READ:


1.78 లక్షల టీచర్‌ ఉద్యోగాలు, అందరూ అర్హులే! నితీశ్ సర్కారు కీలక నిర్ణయం!
బిహార్‌లోని సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి అర్హత కలిగిన ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. మంగళవారం నీతీశ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో విద్యాశాఖ చేసిన ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు కేబినెట్ సెక్రటేరియట్ అదనపు చీఫ్ సెక్రటరీ ఎస్.సిద్దార్థ్ వెల్లడించారు.కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త సర్వీస్ నిబంధనల ప్రకారం గతంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో బిహార్ వాసులను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించుకొనేవారు. అయితే, తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఉద్యోగ నియామకానికి నివాస ఆధారిత రిజర్వేషన్ ఏమీ ఉండదని సిద్ధార్థ్ తెలిపారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


స్టాఫ్‌నర్స్‌ అభ్యర్థులకు అందుబాటులో మాక్‌టెస్ట్, ఇలా ప్రాక్టీస్ చేయండి!
తెలంగాణలో రాష్ట్రంలో స్టాఫ్‌నర్స్‌ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆన్‌లైన్ మాక్‌టెస్ట్‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) అవకాశం కల్పించింది. మొదటిసారి ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అభ్యర్థుల అవగాహన కోసం ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో మాక్‌టెస్ట్ రాయవచ్చని తెలిపింది. రాష్ట్రంలో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల కోసం 40,926 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ని ఆగస్టు 2న నిర్వహించనున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కేంద్రాలుగా పరీక్షలు నిర్వహించనున్నారు. 
పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 239 టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ(టీఎస్‌ఈఎస్‌) 2023-24 విద్యా సంత్సరానికి రాష్ట్రంలోని 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బోధనతో పాటు రెసిడెన్షియల్‌ పాఠశాల విధులకు హాజరుకావడం తప్పనిసరి. షేరింగ్‌ ప్రాతిపదికన బోర్డింగ్‌, లాడ్జింగ్‌ పాఠశాల క్యాంపస్‌లో అందుబాటులో ఉండేలా సదుపాయం ఉంటుంది. ఎంపికైన ఉపాధ్యాయులు సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఆంగ్లభాషలో బోధించాల్సి ఉంటుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 02వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial