హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో ఖాళీగా ఉన్న డిస్ట్రిక్ట్ జడ్జి(ఎంట్రీ లెవెల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ స్టేట్ హైకోర్టు లేదా దాని పరిధిలోని న్యాయస్థానాల్లో అడ్వకేట్‌గా కనీసం ఏడేళ్ల పని అనుభవంతో పాటు ఇతర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 01 సా.5గంటలలోపు సంబంధిత చిరునామాకి పంపాలి.

వివరాలు..

* డిస్ట్రిక్ట్‌ జడ్జి(ఎంట్రీ లెవెల్‌) పోస్టులు

మొత్తం ఖాళీలు: 11

అర్హత: తెలంగాణ హైకోర్టు లేదా దాని పరిధిలోని న్యాయస్థానాల్లో అడ్వకేట్‌గా కనీసం ఏడేళ్ల పని అనుభవంతో పాటు ఇతర విద్యార్హతలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 35 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీత భత్యాలు: నెలకు రూ.1,44,840 – రూ.1,94,660.

ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.05.2023.

ఎంపిక పరీక్ష తేదీలు: 24.06.2023(శనివారం), 25.06.2023(ఆదివారం).

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Chief Secretary to Government of Telangana, General Administration, Burugula Ramakrishna Rao Bavan, 9th Floor, Adarsh Nagar, Hyderabad- 500053

Notification 

Website 

Also Read:

భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో 4,374 ఉద్యోగాలు, అర్హతలివే!ముంబయిలోని భారత అణు శక్తి విభాగం ఆధ్వర్యంలోని 'భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌' వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్‌ 24 నుంచి మే 22 లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులను ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు, అర్హతలివే!తెలంగాణ గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల భర్తీకి ఏప్రిల్ 6న వెబ్‌నోట్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ 22న విడుదల చేశారు. దీనిద్వారా 1276 పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 343 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 147 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 786 పోస్టులను భర్తీ చేయనున్నారు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లి్క్ చేయండి..

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 132 ఆర్ట్ టీచర్ పోస్టులు, జీతమెంతో తెలుసా?తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఆర్ట్ టీచర్, డ్రాయింగ్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 22 వెలువడింది. దీనిద్వారా 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 16 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 6 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 72 పోస్టులు, మైనార్టీ గురుకులాల్లో  38 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..