Process Server Posts: తెలంగాణ జిల్లా కోర్టుల్లో 163 ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు, టెన్త్ అర్హతతో!

పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 11 నుంచి 31 వరకు ఆన్‌‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

Continues below advertisement

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ & సబార్డినేట్ సర్వీసులో ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా వివిధ జిల్లా కోర్టుల్లో మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్థానిక భాషపై పట్టు ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 11 నుంచి 31 వరకు ఆన్‌‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

Continues below advertisement

వివరాలు..

ప్రాసెస్ సర్వర్  పోస్టులు 

మొత్తం ఖాళీలు: 163

జిల్లాల వారీగా ఖాళీలు..  

➥ భద్రాద్రి కొత్తగూడెం:  04     

➥ సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్: 15

➥ సిటీ స్మాల్ కాస్ కోర్టు, హైదరాబాద్: 02 

➥ హనుమకొండ: 05

➥ జోగులాంబ గద్వాల: 05     

➥ జగిత్యాల: 05

➥ జనగామ: 04

➥ జయశంకర్ భూపాలపల్లి: 03     

➥ కుమ్రం భీమ్ ఆసిఫాబాద్: 03

➥ మహబూబాబాద్: 01

➥ మహబూబ్ నగర్: 08

➥ మంచిర్యాల: 02

➥ మెదక్: 01

➥ మేడ్చల్-మల్కాజిగిరి: 18

➥ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు, హైదరాబాద్: 04     

➥ ములుగు: 03

➥ నాగర్ కర్నూలు: 07

➥ నల్గొండ: 03

➥ నారాయణపేట: 04

➥ నిజామాబాద్: 02

➥ పెద్దపల్లి: 02

➥ రాజన్న సిరిసిల్ల: 03

➥ రంగారెడ్డి: 27

➥ సిద్దిపేట: 05

➥ సూర్యాపేట: 07

➥ వికారాబాద్: 06

➥ వనపర్తి: 06

➥ వరంగల్: 05

➥ యాదాద్రి భువనగిరి: 03

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాలను పేర్కొనడంతో పాటు స్థానిక భాష తెలిసి ఉండాలి.

వయోపరిమితి:  01.07.2022 నాటికి 18-34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక ప్రక్రియ: సీబీటీ లేదా ఓఎంఆర్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: మొత్తం 45 మార్కులకు  కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)/ ఓమ్మార్ రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 45 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. వీటిలో జనరల్ నాలెడ్జ్- 30 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్ ఇంగ్లిష్- 15 ప్రశ్నలు-15 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇక ఇంటర్వ్యూకు 5 మార్కులు కేటాయిస్తారు.

జీత భత్యాలు:  నెలకు రూ.22,900-రూ.69,150 చెల్లిస్తారు..

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.01.2023.

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 31.01.2023.

🔰 హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: 15.02.2023.

🔰 కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 2023, మార్చిలో,

Notification
Website  

Also Read:

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 77 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ & సబార్డినేట్ సర్వీసులో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా వివిధ జిల్లా కోర్టుల్లో మొత్తం 77 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 11 నుంచి 31 వరకు ఆన్‌‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 66 ఎగ్జామినర్ ఉద్యోగాలు, ఇంటర్ అర్హత చాలు!
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ & సబార్డినేట్ సర్వీసులో ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా వివిధ జిల్లా కోర్టుల్లో మొత్తం 66 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 11 నుంచి 31 వరకు ఆన్‌‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement