తెలంగాణ గురుకుల పాఠశాలల్లో క్రాఫ్ట్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 92 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 24 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 60 పోస్టులు, గురుకుల పాఠశాలల్లో 4 పోస్టులు, డీఈపీడీఎస్సీ & టీపీలో 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 24 నుంచే ఉద్యోగాల పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో ఉండనుంది.
వివరాలు..
* క్రాఫ్ట్ టీచర్: 92 పోస్టులు
➥ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు: 24 పోస్టులు
➥ బీసీ గురుకుల పాఠశాలలు: 60 పోస్టులు
➥ గురుకుల పాఠశాలలలు: 04 పోస్టులు
➥ డీఈపీడీఎస్సీ & టీపీ: 04 పోస్టులు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
పేస్కేలు: ఆర్ట్ టీచర్ పోస్టులకు రూ.31,040– రూ.92,050, ఆర్ట్ టీచర్ (డీఈపీడీఎస్సీ & టీపీ) పోస్టులకు రూ.33,750 - రూ.99,310.
ముఖ్యమైన తేదీలు...
➦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.04.2023.
➦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.05.2023.
Also Read:
తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు, వివరాలు ఇలా!
తెలంగాణ గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 1276 పీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 343 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 147 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 786 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 24 నుంచే పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో ఉండనుంది. సంబంధిత విభాగాల్లో పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...
తెలంగాణ గురుకులాల్లో 4020 టీజీటీ పోస్టులు, వివరాలు ఇలా!
తెలంగాణ గురుకులాల్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 4020 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 728 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 218 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 2379 పోస్టులు, మైనార్టీ గురుకులాల్లో 594, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 87, స్త్రీ-శిశుసంక్షేమ అభివృద్ధి పాఠశాలలు 14 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో 2008 ఖాళీలు, వివరాలు ఇలా!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 17 నుంచే ఉద్యోగాల పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో ఉండనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..