TGT Final Results: తెలంగాణలోని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 4,020 టీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను గురుకుల నియామక బోర్డు మార్చి 1న విడుదలచేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను సబ్జెక్టులవారీగా అందుబాటులో ఉంచింది. ఇందులో బయోలజికల్ సైన్స్, జనరల్ సైన్స్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సంస్కృతం, సోషల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ సబ్జెక్టులకు ఎంపికైన టీజీటీ అభ్యర్థుల వివరాలు ఉన్నాయి. గురుకుల టీజీటీ పోస్టుల భర్తీకి గతేడాది ఆగస్టు 3 నంచి 23 వరకు రాత పరీక్షలు నిర్వహించిన బోర్డు.. ఈ పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపిక చేసింది. ఎంపికైనవారికి ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ధ్రువ పత్రాల పరిశీలన నిర్వహించింది. తాజాగా తుది ఎంపిక ఫలితాలను విడుదల చేసింది. బయోలజికల్ సైన్స్-301, జనరల్ సైన్స్-85, హిందీ, మ్యాథమెటిక్స్-675, ఫిజికల్ సైన్స్-374, సంస్కృతం-14, సోషల్ స్టడీస్-525, తెలుగు-426, ఉర్దూ-49 మంది ఎంపికయ్యారు.


సబ్జెక్టులవారీగా టీజీటీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఇలా..


 TGT - Social Studies Provisional Selection List


 TGT - Physical Science Provisional Selection List


 TGT - Biological Science Provisional Selection List


 TGT - Telugu Provisional Selection List


 TGT - Mathematics Provisional Selection List


 TGT - Urdu Provisional Selection List


 TGT - Science Provisional Selection List


 TGT - Sanskrit Provisional selection list


పోస్టుల వివరాలు..


* ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు


మొత్తం ఖాళీల సంఖ్య: 4006


➥ సాంఘిక సంక్షేమ గురుకులాలు


పోస్టుల సంఖ్య: 728


సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 98, హిందీ - 65, ఇంగ్లిష్ - 85, మ్యాథమెటిక్స్ - 101, ఫిజికల్ సైన్స్ - 147, బయోలాజికల్ సైన్స్ - 45, సోషల్ స్టడీస్ - 187.


➥ గిరిజన సంక్షేమ గురుకులాలు 


పోస్టుల సంఖ్య: 218 


సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 28, హిందీ - 39, ఇంగ్లిష్ - 19, మ్యాథమెటిక్స్ - 29, ఫిజికల్ సైన్స్ - 15, బయోలాజికల్ సైన్స్ - 21, జనరల్ స్టడీస్ - 20, సోషల్ స్టడీస్ - 47.


➥ బీసీ సంక్షేమ గురుకులాలు 


పోస్టుల సంఖ్య: 2379 


సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 285, హిందీ - 263, ఇంగ్లిష్ - 506, మ్యాథమెటిక్స్ - 520, ఫిజికల్ సైన్స్ - 269, బయోలాజికల్ సైన్స్ - 261, సోషల్ స్టడీస్ - 275.


➥ మైనార్టీ గురుకులాలు 


పోస్టుల సంఖ్య: 594


సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 55, ఉర్దూ-120, హిందీ - 147, ఇంగ్లిష్ - 55, మ్యాథమెటిక్స్ - 86, సోషల్ స్టడీస్ - 103, జనరల్ స్టడీస్ - 76, సోషల్ స్టడీస్ - 55.


➥ గురుకుల పాఠశాలలు 


పోస్టుల సంఖ్య: 87 


సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 22, సంస్కృతం-25, హిందీ - 02, ఇంగ్లిష్ - 16, మ్యాథమెటిక్స్ - 05, జనరల్ స్టడీస్ - 02, సోషల్ స్టడీస్ - 15.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...


ALSO READ:


లైబ్రేరియన్‌ పోస్టుల ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైంది వీరే
తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. రాతపరీక్ష ద్వారా 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 5న ధ్రువ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ శుక్రవారం (మార్చి 1న) తెలిపింది. మార్చి 5న ఉదయం 10.30 గంటల నుంచి టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో పరిశీలన ఉంటుందని పేర్కొంది. సర్టిఫికేట్ల పరిశీలనకు వచ్చే అభ్యర్థులందరూ చెక్‌లిస్టులోని పత్రాలు తీసుకురావాలని సూచించింది. పరిశీలనలో ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలు సమర్పించకుంటే తదుపరి సమయం ఇవ్వబోమని కమిషన్‌ స్పష్టం చేసింది. షెడ్యూలు ప్రకారం పరిశీలనకు రాకుంటే అభ్యర్థిత్వాన్ని నియామక ప్రక్రియలో పరిశీలించబోమని వెల్లడించింది. 
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..