'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్షలో అభ్యంతరాలకు నేటితో (నవంబరు 4తో) గడువు ముగియనుంది. నేడు చివరిరోజు కావడంతో అభ్యర్థుల నుంచి వినతులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  'గ్రూప్‌-1' వంటి పరీక్షలకు ప్రిలిమ్స్‌ కీ వెబ్‌సైట్‌లో పెట్టిన తర్వాత సాధారణంగా మూడురోజులు మాత్రమే సమయం ఇస్తారు. కానీ తొలిసారిగా టీఎస్‌పీఎస్సీ 5 రోజులు సమయం ఇవ్వడం పట్ల అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


గ్రూప్-1 ఆన్సర్ 'కీ'లో దాదాపు ఎలాంటి అభ్యంతరాలు లేవని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. టీఎస్‌పీఎస్సీకి సైతం గతంతో పోలిస్తే తక్కువ అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది. అభ్యర్థులు నవంబరు 4న సాయంత్రం 5 గంటల్లోపు తమ అభ్యంతరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. అభ్యంతరాల నమోదుకు ఎట్టి పరిస్థితుల్లోనూ గడువును పొడిగించే అవకాశం ఇక లేదని టీఎస్‌పీఎస్సీ వర్గాలు స్పష్టం చేశాయి. అభ్యర్థులు చివరిరోజును సద్వినియోగం చేసువాలని కమిషన్‌ సూచించింది.


Also Read:  'గ్రూప్-1' ప్రిలిమినరీ కీ వచ్చేసింది, రెస్పాన్స్ షీట్లు అందుబాటులో! 


తెలంగాణ గ్రూప్‌-1లో 503 పోస్టులకు 2,86,051 మంది ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. ఒక్కో ఉద్యోగానికి 50 మంది చొప్పున మెయిన్స్‌కు క్వాలిఫై చేయనున్నారు. అంటే.. మొత్తం 25,150 మంది గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించనున్నారు. ఒకవేళ అభ్యర్థుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాకుంటే రెండు, మూడు రోజుల్లో ఫైనల్‌ కీ ని ప్రకటించనుంది. ఫైనల్ కీతోపాటు ఫలితాలను కూడా టీఎస్‌పీఎస్సీ విడుదల చేయనుంది.


ప్రత్యేక లింక్ ద్వారానే అభ్యంతరాలు...


➦ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన వెబ్‌లింక్ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది.


➦ ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే అభ్యర్ధులు అభ్యంతరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్స్ లేదా ఇతర రాతపూర్వక మార్గాల్లో అభ్యంతరాలను సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోరు.


➦ అభ్యర్థులు అభ్యంతరాలతో పాటు సరైన సమాధానానికి సంబంధించిన రుజువులు లేదా రిసోర్సు కాపీలను పీడీఎఫ్‌ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది.


➦ అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్ నెంబర్, పుట్టినతేది వివరాలు నమోదు చేసి అభ్యంతరాలు సమర్పించాలి. 


➦ ఇంగ్లిష్‌లోనే అభ్యంతరాలు నమోదుచేయాలి.


TSPSC Group-1 ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలపడానికి క్లిక్ చేయండి..


తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు గాను.. 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,86,051 అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.


Also Read: 'గ్రూప్-1'తో మొదలు! ఇక టీఎస్‌పీస్సీ పరీక్షలు'ఈజీ' కాదు!


కటాఫ్ మార్కులు లేవు..


తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష కటాఫ్ మార్కులపై సామాజిక మాధ్యమాల్లో వార్తలు చెక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారంపై టీఎస్‌పీఎస్సీ అధికారులు అక్టోబరు 17న స్పష్టత ఇచ్చారు. 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష కేవలం  స్క్రీనింగ్ పరీక్ష మాత్రమేనని, ఇందులో ఎలాంటి కనీస అర్హత మార్కులు ఉండవని ప్రకటించింది. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక విధానంలో మార్పులు జరిగాయని వివరించింది. గతంలో మార్కుల ప్రాతిపదికన ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసే విధానం ఉండేదని పేర్కొంది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం.. మల్టీ జోన్ వారీగా రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.


మరిన్ని ఉద్యోగ సంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..