భారత ప్రభుత్వ గుర్తింపు కలిగిన విశాఖపట్నంలోని టాటా మెమోరియల్ సెంటర్ ఆధ్వర్యంలో నడుస్తున్న టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో వివిధ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది. కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు చేపట్టనున్నారు.అక్టోబరు 6 నుంచి 11 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిచనున్నారు. విశాఖపట్నంలోని హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 



వివరాలు...



* టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు



మొత్తం పోస్టులు: 24     


పోస్టుల వివరాలు: నర్స్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, ఐటీ అసిస్టెంట్ కంప్యూటర్ ప్రోగ్రామర్, ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్), అడ్మిన్ అసిస్టెంట్.  


అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. దీనిప్రకారం పోస్టులననుసరించి పదోతరగతి, డిప్లొమా/గ్రాడ్యుయేషన్/బీఎస్సీ/జీఎన్ఎం/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.     


వయసు: 30 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.     


దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో అభ్యుర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.     


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.     


ఇంటర్వ్యూ వేదిక: హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నం.     


ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 6 - 11 వరకు.     

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి ఉదయం 11 వరకు.  


Notification


Website


ఇవీ చదవండి:


UPSC Notification: 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2023' నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టులెన్నో తెలుసా?
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 11లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష, జూన్ 24, 25 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



UPSC: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా..
యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



SSC Recruitment: భారత వాతావరణ శాఖలో 990 ఉద్యోగాలు, అర్హతలివే!

భారత వాతావరణ శాఖలోని సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాతపరీక్షకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ కేంద్రాల్లోని సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రూప్-'బి' నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 18లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లి్క్ చేయండి...


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...