THDC: టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు- వివరాలు ఇలా ఉన్నాయి

THDC Jbs: టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ ఖాళీగా ఉన్న 129 ఇంజినీర్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Continues below advertisement

THDC Recruitment: టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్(THDC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 129 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంబీఏ, సీఏ, సీఎంఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

Continues below advertisement

వివరాలు..

ఖాళీల సంఖ్య: 129.

* ఇంజినీర్‌ పోస్టులు

⏩ గ్రూప్-ఎ (హైడ్రో/థర్మల్/కోల్ మైన్స్ ప్రాజెక్ట్)

➥ సివిల్: 30 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 13, ఈడబ్ల్యూఎస్- 03, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 08, ఎస్సీ- 04, ఎస్టీ- 02.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

➥ ఎలక్ట్రికల్: 25 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 13, ఈడబ్ల్యూఎస్- 02, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 06, ఎస్సీ- 03, ఎస్టీ- 01.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

➥ మెకానికల్: 20 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 09, ఈడబ్ల్యూఎస్- 02, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 05, ఎస్సీ- 03, ఎస్టీ- 01.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

➥ జియోలజీ జియోటెక్నికల్: 07 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 04, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 01, ఎస్సీ- 01.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఫుల్‌టైమ్ డిగ్రీ, ఎంఎస్సీ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

➥ ఎన్విరాన్‌మెంట్: 08 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 03, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 02, ఎస్సీ- 02.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

➥ మైనింగ్: 07 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 04, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 01, ఎస్సీ- 01.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఫుల్‌టైమ్ ఢిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. DGMS నుంచి కోల్‌లో చెల్లుబాటు అయ్యే ఫస్ట్‌క్లాస్ మేనేజర్ సర్టిఫికెట్ ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

➥ హ్యూమన్‌ రీసోర్స్‌: 15 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: యూఆర్- 07, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 04, ఎస్సీ- 02, ఎస్టీ- 01.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఫుల్‌టైమ్ ఎంబీఏ, పీజీ, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 12.02.2025 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.

➥ ఫైనాన్స్‌: 15 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 07, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 04, ఎస్సీ- 02, ఎస్టీ- 01.
అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా/ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి సీఏ/సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

⏩ గ్రూప్-బి (విండ్ పవర్ ప్రాజెక్ట్)

➥ ఇంజినీర్‌(విండ్ పవర్ ప్రాజెక్ట్): 02 పోస్టులు
పోస్టుల కేటాయింపు: యూఆర్- 02.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్-సర్వీస్‌మెన్/డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు/దూబ్ క్షేత్రం/ THDC ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంత కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

పరీక్షా కేంద్రాలు: ఢిల్లీ, నోయిడా, డెహ్రాడూన్, లక్నో, చండీగఢ్.

జీతం: నెలకు రూ.50,000 - 1,60,000.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.02.2025.

✦ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14.03.2025.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

Continues below advertisement
Sponsored Links by Taboola