TGPSC Polytechnics Lecturers Merit List: తెలంగాణలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో అర్హత సాధించి, 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ ఆగస్టు 7న ప్రకటించింది. దివ్యాంగ అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఎంపిక చేసింది. మొత్తం 490 మంది అభ్యర్థులు మెరిట్ జాబితాకు ఎంపికయ్యారు. సబ్జెక్టుల వారీగా చూస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-84, లెటర్ ప్రెస్ (ప్రింటింగ్ టెక్నాలజీ)-10, ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్-08, కెమిస్ట్రీ-15, ఫిజిక్స్-10, మెటలర్జి-10, ఫార్మసీ-08, ప్యాకేజింగ్ టెక్నాలజీ-06, ఫుట్‌వేర్ టెక్నాలజీ-05, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్-02, టెన్నరీ-02, టెక్స్‌టైల్ టెక్నాలజీ-02, జియోలజీ-02, బయోమెడికల్ ఇంజినీరింగ్-06, కెమికల్ ఇంజినీరింగ్-02, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-47, ఆటోమొబైల్ ఇంజినీరింగ్-28, మెకానికల్ ఇంజినీరింగ్-74, సివిల్ ఇంజినీరింగ్-169 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.


సెప్టెంబరు 20 నుంచి ధ్రువపత్రాల పరిశీలన..   
ఎంపికైన అభ్యర్థులకు సబ్జెక్టులవారీగా సెప్టెంబరు 20 నుంచి 26 వరకు టీజీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా, పరిశీలన షెడ్యూలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు సెప్టెంబరు 19 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి లెవల్ (9ఎ)- రూ.56,100- 1,77,500, లెవల్-10- రూ.57,700-1,82,400 మధ్య జీతాలు చెల్లిస్తారు. 


అభ్యర్థుల ఎంపిక జాబితా-ధ్రువపత్రాల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


ధ్రువపత్రాల పరిశీలనకు అవసరమయ్యే డాక్యుమెంట్లు..
1) వెబ్‌సైట్‌లో సూచించిన ప్రకారం చెక్ లిస్ట్ (1 సెట్) ఉండాలి.
2) దరఖాస్తు సమయంలో సమర్పించి అప్లికేషన్ ఫామ్ (పీడీఎఫ్) ప్రింట్ కాపీ  
3) పరీక్ష హాల్‌టికెట్
4) పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో. 
5) 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు లేదా ప్రైవేట్/ఓపెన్ స్కూల్‌లో చదివిన అభ్యర్థులైతే రెసిడెన్స్/స్థానికత సర్టిఫికేట్ ఉండాలి. 
6) డిగ్రీ లేదా పీజీ ప్రొవిజినల్/ కాన్వొకేషన్ సర్టిఫికేట్, మార్కుల మెమో. 
7) ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ (అందులో తల్లిదండ్రుత పేర్లు తప్పనిసరిగా ఉండాలి).
8) బీసీ వర్గానికి చెందినవారైతే నాన్-క్రీమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇతర బీసీ సర్టిఫికేట్లు అంగీకరించరు.
9) EWS సర్టిఫికేట్
10) రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులగుతై వయోపరిమితి సడలింపు కోసం సర్వీస్ సర్టిఫికేట్/NCC  ఇన్‌స్ట్రక్టర్/ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్/ సెన్సస్ సర్వీస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 
11) ఇన్-సర్వీస్ అభ్యర్థులైతే NOC తప్పనిసరి. 
12) గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు సెట్ల అటెస్టేషన్ సర్టిఫికేట్ కాపీలు ఉండాలి. సంబంధింత పత్రాలు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
13) నోటిఫికేషన్‌ సమయంలో పేర్కొన్న అన్ని ఇతర సర్టిఫికేట్లు తీసుకురావాలి.
14) వెబ్ ఆప్షన్ల నమోదుకు 19.09.2024 - 28.09.2024 ప్రత్యేక లింక్ అందుబాటులో ఉండనుంది.
15) ఇటీవల దిగిన 3 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు


తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్  విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జనవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 4 నుంచి 8 వరకు సబ్జెక్టులవారీగా పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పరీక్షలు నిర్వహించారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1(జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 (అభ్యర్థుల సబ్జెక్టు) పరీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణ కోసం హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, హనుమకొండ, నిజామాబాద్‌లలోని కేంద్రాల్లో నిర్వహించారు. పరీక్ష ఫలితాలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 19న కమిషన్ విడుదల చేసింది. తాజాగా 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను, సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూలును కమిషన్ విడుదల చేసింది.