TG GENCO Exam Halltickets: తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGGENCO)లో అసిస్టెంట్ ఇంజినీర్ (Assistant Engineer), కెమిస్ట్ (Chemist) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్షల హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, ఫోన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 14న రాతపరీక్షలు నిర్వహించనున్నారు.


హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 


పరీక్ష షెడ్యూలు ఇలా..
➥ జులై 14న కంప్యూటర్ ఆధారిత విధానంలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం మూడు సెషన్లలో పరీక్షలు జరుగనున్నాయి.
➥ మొదటి సెషన్‌లో ఉదయం 9 గంటల నుంచి 10.40 గంటల వరకు మెకానికల్, కెమిస్ట్ విభాగాలకు పరీక్ష నిర్వహిస్తారు.
➥ రెండో సెషన్‌లో మధ్యాహ్నం 1 గంట నుంచి 2.40 గంటల వరకు ఎలక్ట్రికల్ విభాగాలకు పరీక్ష నిర్వహిస్తారు.
➥ మూడో సెషన్‌లో సాయంత్రం 5 గంటల నుంచి 6.40 వరకు సివిల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. 


పరీక్ష విధానం..
➥ మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష నిర్వహిస్తారు.
➥ పరీక్షలో రెండు సెక్షన్ల (సెక్షన్-ఎ, సెక్షన్-బి ) నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది.
➥ 'సెక్షన్-ఎ'లో అభ్యర్థుల సబ్జెక్ట్ (కోర్ టెక్నికల్) నుంచి 80 ప్రశ్నలు-80 మార్కులు ఉంటాయి.
➥'సెక్షన్-బి'లో ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ, కల్చర్, తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి.
➥ పరీక్ష సమయం 2 గంటలు (120 నిమిషాలు). 


తెలంగాణ పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (TGENCO)‌లో అసిస్టెంట్ ఇంజినీర్ (AE), కెమిస్ట్ (Chemist) పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరు 5న నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 399 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఇందులో 339 ఏఈ పోస్టులు, 60 కెమిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల నుంచి అక్టోబరు 7 నుంచి నవంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు.


ఈ పోస్టుల భర్తీకి మార్చి 31న రాతపరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం నుంచి అనుమతి కోసం ఎదురుచూసింది. పరీక్షల నిర్వహణకు ఎన్నికల్ సంఘం నిరాకరిచడంతో.. పరీక్షలను వాయిదావేయాల్సి వచ్చింది. తాజాగా ఎన్నికల కోడ్ ముగియడంతో రాతపరీక్షల తేదీలను జెన్‌కో యాజమాన్యం ప్రకటించింది.   


జెన్‌కోలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో విధిగా 5 సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి సర్వీస్ బాండ్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్‌లో ఏడాదికాలం శిక్షణ ఉంటుంది. రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్‌ కాలంలో ఉద్యోగం మానేస్తే.. నష్టపరిహారం కింద అభ్యర్థుల నుంచి రూ.50,000 వసూలు చేస్తారు. ఇక ప్రొబేషన్ పీరియడ్ తర్వాత ఉద్యోగం వదిలి వెళితే.. రూ.1లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.


అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


కెమిస్ట్ పోస్టుల నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..