TCIL Recruitment: న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులని అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ/ బీఈ/ బీటెక్/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 3 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 10
* జనరల్ మేనేజర్ (ఈ7)/ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఈ-4 స్కేల్)/ మేనేజర్ (ఈ-3 స్కేల్)/ డిప్యూటీ మేనేజర్ (ఈ-2 స్కేల్)
⏩ జనరల్ మేనేజర్ (ఈ7)
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ/ బీఈ/ బీటెక్/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
అనుభవం: సంబంధిత ఫీల్డ్‌లో 17 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 56 సంవత్సరాలు మించకూడదు.
జీతం: సంవత్సరానికి 20 లక్షలు.
⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఈ-4 స్కేల్)
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ/ బీఈ/ బీటెక్/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
అనుభవం: సంబంధిత ఫీల్డ్‌లో 08 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 56 సంవత్సరాలు మించకూడదు.
జీతం: సంవత్సరానికి 12 లక్షలు.
⏩ మేనేజర్ (ఈ-3 స్కేల్)
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ/ బీఈ/ బీటెక్/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
అనుభవం: సంబంధిత ఫీల్డ్‌లో 06 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 56 సంవత్సరాలు మించకూడదు.
జీతం: సంవత్సరానికి 09 లక్షలు.
⏩ డిప్యూటీ మేనేజర్ (ఈ-2 స్కేల్)
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ/ బీఈ/ బీటెక్/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
అనుభవం: సంబంధిత ఫీల్డ్‌లో 03 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 56 సంవత్సరాలు మించకూడదు.
జీతం: సంవత్సరానికి 06 లక్షలు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ తదితరాల అధారంగా.
క్రింద పేర్కొన్న ఫీల్డ్‌లో అభ్యర్థులకు ఉండాల్సిన అనుభవాలు..
➥ స్ట్రాంగ్ కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అండ్ నెట్‌వర్కింగ్ సామర్థ్యాలను కలిగి ఉండాలి.
➥ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ వర్డ్‌లలో ప్రావీణ్యం ఉండాలి.
➥ ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్‌లలో పని చేయగలగాలి.
➥ నెట్‌వర్క్ ప్లానింగ్ అనుభవం ఉండాలి.
➥ షార్ట్-టర్మ్ అండ్ లాంగ్-టర్మ్ బిజినెస్ ప్లాన్ ప్రిపేర్ చేయడంలో అనుభవం ఉండాలి.
➥ ప్రాజెక్ట్ మదింపును చేయడంలో అంచనా, వ్యాపార ప్రణాళిక యొక్క వివిధ ప్రత్యామ్నాయ ఎంపికల వ్యయ-ప్రయోజన విశ్లేషణలో అనుభవం ఉండాలి.
➥ సేల్స్, మార్కెటింగ్, టెలికాం వ్యాపార అభివృద్ధి, ఐటీ/ఐటీఈఎస్, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, సీఆర్‌ఎంలో అనుభవం ఉండాలి.
➥ టెలికాం, ఐటీ నెట్‌వర్క్ ఆపరేషన్, మెయింటెనెన్స్, ప్లానింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్ మరియు కమీషనింగ్.
➥ మెటీరియల్ మేనేజ్‌మెంట్, టెండరింగ్ ప్రాసెసింగ్.
➥ ప్రాజెక్ట్ అంచనా, వ్యాపార విశ్లేషణ.
➥ 3G/4G మొబైల్ టెక్నాలజీ, FTTH, MPLS, IMS, వీడియో సర్వేలెన్స్, SD-WAN, OFC కేబుల్ లేయింగ్, M/W, Wi-Fi మొదలైన వాటిలో పరిచయం అండ్ అనుభవం ఉండాలి.
➥ IoT, డేటా సెంటర్, SoC, సైబర్ సెక్యూరిటీ, eCRM, బిల్లింగ్ సిస్టమ్‌లో పరిచయం మరియు అనుభవం ఉండాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Chief General Manager (HR),
Telecommunications Consultants India Ltd.,
TCIL Bhawan, Greater Kailash –I, New Delhi – 11004.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.06.2024.