నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సారంగాపూర్ క్యాంపస్), పీజీ కాలేజ్ (భిక్నూర్)లో పార్ట్ టైమ్ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా ఎంఈడీ & ఎంఎస్సీ జువాలజీ విభాగాలలో పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు యూజీసీ- నెట్/ సెట్/ స్లెట్ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 27లోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవచ్చు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 07

* పార్ట్ టైం లెక్చరర్: 07 పోస్టులు

1) ఎంఈడీ: 04 పోస్టులు

2) ఎంఎస్సీ (జువాలజీ): 03 పోస్టులు

అర్హత: 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు యూజీసీ- నెట్/సెట్/స్లెట్ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. సబ్జెక్టు, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై మంచి పట్టు ఉండాలి.

వయోపరిమితి: 65 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. వీటిలో రాతపరీక్షకు 50 మార్కులు, అకడమిక్ మెరిట్‌కు 40 మార్కులు, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు 

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
The Registrar
Telangana University, 
Dichpally, Nizamabad-503322.

దరఖాస్తులకు చివరితేదీ: 27.12.2022.


Notification & Application


Website  



Also Read:


1392 జేఎల్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 20న ప్రారంభమైంది. అభ్యర్థులు జనవరి 10న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి డిసెంబరు 16 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల డిసెంబరు 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్  విడుదల చేసింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో పోస్టుల వివరాలు అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచీలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలో వైద్య విద్యపూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభ‌వార్త వినిపించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌లో 1147 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి డిసెంబరు 20న ఉద‌యం 10:30 గంట‌ల నుంచి జ‌న‌వ‌రి 5న సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...