TSPSC Group4 Results: తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు (TSPSC Group 4 Results) ఫిబ్రవరి 9న విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెల్లడించింది. మొత్తం 7,26,837 మంది అభ్యర్థులతో  మెరిట్ జాబితాను టీఎస్‌పీస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చని కమిషన్ సూచించింది. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తామని కమిషన్ తెలిపింది. 

తెలంగాణలోమొత్తం 8,180 ఉద్యోగాల భర్తీకి జులై 1న రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష కోసం  రాష్ట్రవ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్‌-1కు 7,62,872 మంది, పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్ష నిర్వహించారు. 

గ్రూప్-4 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

Website

గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 2న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రాథమికంగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అయితే డిసెంబరు 30న విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్‌లో మాత్రం 8039 పోస్టులనే భర్తీ చేయనున్నట్లు తెలిపింది. తర్వాత ఈ పోస్టులకు అదనంగా 141 పోస్టులను జతచేయండంతో.. మొత్తం పోస్టులు సంఖ్య 8,180 కి చేరినట్లయింది. 

తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 28న విడుదల చేసింది. ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 4 అవకాశం కల్పించింది. అనంతరం అక్టోబరు 6న ఫైనల్ కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేయగా.. పలు మార్పులు చోటుచేసుకున్నాయి.

➥ పేపర్-1లో 7 ప్రశ్నలకు తొలగించగా.. 8 ప్రశ్నలకు సమాధానాలను మార్చింది. అలాగే పేపర్-2లో 3 ప్రశ్నలను తొలగించగా.. 5 ప్రశ్నలకు సమాధానాలను మార్చింది.

➥ పేపర్-1లో 11, 21, 60, 73, 129, 132, 148 ప్రశ్నలకు టీఎస్‌పీఎస్సీ తొలగించింది. అలాగే పలు ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేసింది. వాటిలో ప్రశ్న-19 సమాధానాన్ని 2 నుంచి 4 కి; ప్రశ్న-31 సమాధానాన్ని 2 నుంచి 1, 2 , 3, 4కి; ప్రశ్న-40 సమాధానాన్ని 1 నుంచి 2కి; ప్రశ్న-50 సమాధానాన్ని 1 నుంచి 1, 2కి; ప్రశ్న-55 సమాధానాన్ని 2 నుంచి 2, 3కి; ప్రశ్న-64 సమాధానాన్ని 1 నుంచి 3కి; ప్రశ్న-128 సమాధానాన్ని 1 నుంచి 2కి; ప్రశ్న-139 సమాధానాన్ని 1 నుంచి 1, 4కి మార్చింది.

➥ పేపర్-2లో 25, 40, 78 ప్రశ్నలకు టీఎస్‌పీఎస్సీ తొలగించింది. అలాగే పలు ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేసింది. వాటిలో ప్రశ్న-11 సమాధానాన్ని 2 నుంచి 2, 4కి; ప్రశ్న-18 సమాధానాన్ని 1 నుంచి 4కి; ప్రశ్న-33 సమాధానాన్ని 4 నుంచి 1కి; ప్రశ్న-94 సమాధానాన్ని 2 నుంచి 3కి; ప్రశ్న-96 సమాధానాన్ని 2 నుంచి 3కి మార్పు చేసింది.

గ్రూప్-4 పోస్టుల వివరాలు... 

మొత్తం ఖాళీల సంఖ్య: 8,180 పోస్టులు

1) జూనియర్ అకౌంటెంట్: 429 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు: ఆర్థికశాఖ - 191, మున్సిపల్ శాఖ - 238.

2) జూనియర్ అసిస్టెంట్: 5730 పోస్టులు 

విభాగాలవారీగా ఖాళీలు:

వ్యవసాయశాఖ-44 బీసీ సంక్షేమశాఖ-448 పౌరసరఫరాల శాఖ-72 అటవీశాఖ-23
వైద్యారోగ్యశాఖ-338 ఉన్నత విద్యాశాఖ-743 హోంశాఖ-133 నీటిపారుదల శాఖ-51
మైనార్టీ సంక్షేమశాఖ-191 పురపాలక శాఖ-601 పంచాయతీరాజ్-37 రెవెన్యూశాఖ-2,096
సెకండరీ విద్యాశాఖ-97 రవాణాశాఖ-20 గిరిజన సంక్షేమ శాఖ-221 మహిళా, శిశు సంక్షేమం-77
ఆర్థికశాఖ-46 కార్మికశాఖ-128 ఎస్సీ అభివృద్ధి శాఖ-474 యువజన సర్వీసులు-13

3) జూనియర్ ఆడిటర్: 18 పోస్టులు

విభాగం: డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్

4) వార్డ్ ఆఫీసర్: 1862 పోస్టులు

విభాగం: కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..