తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జూన్‌ 11న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక 'కీ' ని జూన్ 28న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థులు రెస్పాన్స్ షీట్లను కూడా కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జులై 27 వరకు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉండనున్నాయి.


గ్రూప్-1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులు జులై 1 నుంచి జులై 5న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు నమోదుచేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా నమోదుచేసే అభ్యంతరాలను మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. మరే ఇతర విధనాాల్లోనూ అభ్యంతరాల నమోదుకు అవకాశం లేదు. నిర్ణీత గడువు తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అభ్యంతరాలను స్వీకరించరు.


రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 2.32లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. మొత్తం 503 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రిలిమినరీ కీ, ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్‌ షీట్లను ఈ కింది లింక్‌లపై క్లిక్‌ చేయడం ద్వారా పొందొచ్చు.


గ్రూప్-1 ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..


అభ్యర్థులు ఓఎంఆర్ పత్రాల కోసం క్లిక్ చేయండి.. 


ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61.16 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి  మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ప్రశ్న పత్రం లీకేజీ కారణంగా గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేయడంతో మళ్లీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష కోసం 994 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన లోటుపాట్లు, గందరగోళం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. 



ALSO READ:


టీఎస్‌పీఎస్సీ హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల, రెస్పాన్స్‌ షీట్లూ అందుబాటులో!
తెలంగాణలో హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి జూన్ 17న నిర్వహించిన రాతపరీక్షకు సంబంధించిన ప్రాథమిక 'కీ'ని టీఎస్‌పీఎస్సీ జూన్ 27న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది. మాస్టర్‌ ప్రశ్నపత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు కమిషన్ తెలిపింది. జులై 26 వరకు రెస్పాన్స్‌షీట్లు ఆన్‌లైన్‌లో ఉండనున్నాయి. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే జూన్‌ 28 నుంచి జులై 1 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఇంగ్లిష్‌లో మాత్రమే తమ అభ్యంతరాలు నమోదుచేయాలని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. 
ఆన్సర్ కీ, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


కలవ్య ఆదర్శ పాఠశాలల్లో 239 టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ(టీఎస్‌ఈఎస్‌) 2023-24 విద్యా సంత్సరానికి రాష్ట్రంలోని 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బోధనతో పాటు రెసిడెన్షియల్‌ పాఠశాల విధులకు హాజరుకావడం తప్పనిసరి. షేరింగ్‌ ప్రాతిపదికన బోర్డింగ్‌, లాడ్జింగ్‌ పాఠశాల క్యాంపస్‌లో అందుబాటులో ఉండేలా సదుపాయం ఉంటుంది. ఎంపికైన ఉపాధ్యాయులు సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఆంగ్లభాషలో బోధించాల్సి ఉంటుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 02వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial