TSPSC Group2 Exam Postponed: తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ బుధవారం (డిసెంబరు 27) రాత్రి ప్రకటించింది. వాయిదాపడిన పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉండగా.. అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలతో వాయిదా పడ్డాయి. ఆ తర్వాత నవంబర్ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మరోసారి ఈ పరీక్ష వాయిదా పడింది. తాజాగా మరోసారి వాయిదా వేస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ అధికారులు ప్రకటించారు.
తెలంగాణలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ షెడ్యూలు విడుదల చేసింది. అయితే గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది.
గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
గ్రూప్-2 పోస్టుల వివరాలు...
మొత్తం ఖాళీల సంఖ్య: 783
1) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11 పోస్టులు
విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.
2) అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59 పోస్టులు
విభాగం: కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ డిపార్ట్‌మెంట్.
3) నాయబ్ తహసిల్దార్: 98 పోస్టులు
విభాగం: ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.
4) సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14 పోస్టులు
విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్.
5) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63 పోస్టులు
విభాగం: కంట్రోల్ ఆఫ్ కమిషనర్- కోఆపరేషన్ & రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్.
6) అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09 పోస్టులు
విభాగం: కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్.
7) మండల్ పంచాయత్ ఆఫీసర్: 126 పోస్టులు
విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.
8) ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97 పోస్టులు
విభాగం: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్.
9) అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38 పోస్టులు
విభాగం: హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్.
10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165 పోస్టులు
విభాగం: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.
11) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15 పోస్టులు
విభాగం: లెజిస్లేటివ్ సెక్రటేరియట్.
12) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25 పోస్టులు
విభాగం: ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్.
13) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07 పోస్టులు
విభాగం: లా డిపార్ట్‌మెంట్.
14) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్.
15) డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11 పోస్టులు
విభాగం: జువైనల్ కరెక్షనల్ సర్వీసెస్ & వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్‌మెంట్.
16) అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు
విభాగం: బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.
17) అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09 పోస్టులు
విభాగం: ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.
18) అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు
విభాగం: ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.
గ్రూప్-2 నోటిఫికేషన్, పరీక్ష స్వరూపం కోసం క్లిక్ చేయండి..