తెలంగాణలో స్టాఫ్ట్ నర్స్ పోస్టుల భర్తీకి ఆగస్టు 2న నిర్వహించనున్న పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నాలుగు జిల్లాల్లో 40 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో హైదరాబాద్‌‌లో 24 కేంద్రాలు, ఖమ్మంలో 6 కేంద్రాలు, నిజామాబాద్‌‌లో 2 కేంద్రాలు, వరంగల్‌లలో 8 కేంద్రాలు ఉన్నాయి. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 40,936 మంది దరఖాస్తు చేసుకున్నారు.


రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మం పట్టణంలో ఒక్క పరీక్షా కేంద్రాన్ని మార్పు చేశారు. ప్రియదర్శిని మహిళా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరీక్ష నిర్వహించే స్థితిలో లేదు. కాబట్టి దానికి బదులుగా స్వర్ణ భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఖమ్మం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లలో పరీక్షలు జరుగుతాయి. హాల్‌ టికెట్‌ నంబర్లు అలాగే ఉంటాయి. పరీక్షా కేంద్రం మార్పును సూచించే సవరించిన హాల్‌‌టికెట్లను అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.


రాతపరీక్ష విధానం: మొత్తం 80 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇంగ్లిష్‌లోనే పరీక్ష ఉంటుంది. తప్పుగా ఇచ్చిన జవాబులకి నెగెటివ్ మార్కులు ఉండవు. కంప్యూటర్‌ ఆధారిత పద్ధతిలో నిర్వహించే పరీక్షను 80 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆలోగా రాయలేకపోతే ఆటోమేటిక్‌గా సెషన్‌ ముగుస్తుంది. పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుందని, నెగెటివ్‌ మార్కులు ఉండు. మొత్తం మూడు సెషన్ల (ఉదయం 7.30, ఉదయం 11, మధ్యాహ్నం 2.30)లో పరీక్ష నిర్వహిస్తున్నారు. 


అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు..


➤ పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందు నుంచి కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభానికంటే 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. 


➤ అభ్యర్థులు తమ హాల్‌‌టికెట్‌ను ఏ4 సైజ్‌ పేపర్‌పై ప్రింట్‌ తీసుకుని రావాలి. హాల్‌‌టికెట్‌పై అభ్యర్థుల ఫొటో, సంతకం ఉంటేనే పరీక్షకు అనుమతిస్తారు.


➤ హాల్‌టికెట్‌పై ఫొటో లేని అభ్యర్థులు.. గెజిటెడ్‌ ఆఫీసర్‌ అటెస్టేషన్‌ చేసిన 3 పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. వీటిని తీసుకురాని వారిని పరీక్షకు అనుమతించబోరు.

➤అభ్యర్థులు హాల్‌టిటెక్‌తోపాటు తప్పనిసరిగా ఆధార్‌, పాస్‌పోర్ట్‌, పాన్‌కార్డు, ఓటరు ఐడీ , డ్రైవింగ్‌ లైసెన్సు వంటి గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తెచ్చుకోవాలి.

➤ అభ్యర్థులు కేవలం హాల్‌‌టికెట్‌తో పాటు ఒక బ్లూ, బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌ తెచ్చుకోవాలి. 

➤ఉదయం 9 గంటలకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 12.30 గంటలకు రెండో సెషన్‌, సాయంత్రం 4 గంటలకు మూడో సెషన్‌ పరీక్షలు ప్రారంభమవుతాయి.

➤ కేవలం చెప్పులతోనే పరీక్షకు హాజరుకావాలి. షూలాంటివి వేసుకుని రాకూడదు.


➤ పరీక్షా కేంద్రంలో అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకుంటారు. అందువల్ల చేతులకు మెహందీ, టాటూలు పెట్టుకోవద్దు.


➤వాటర్‌ బాటిల్‌ తెచ్చుకోవచ్చు.


➤ ఇంగ్లిషు మీడియంలో జరిగే ఈ పరీక్షా సమయం 80 నిమిషాలు. 


➤ బయోమెట్రిక్‌ పద్ధతిలో హాజరును నమోదు చేస్తున్నందున అభ్యర్థులు తమ చేతులకు మెహెందీ, ఇంక్‌, టాటూలు వేసుకుని రాకూడదు.


➤ సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్‌, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌, రికార్డింగ్‌ తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాలు, పర్సులు, హ్యాండ్‌బ్యాగ్‌లు తీసుకురాకూడదు.

➤ఖమ్మంలో ప్రియదర్శిని కళాశాల నుంచి స్వర్ణభారతి కళాశాలకు మారిన కేంద్రంలో 


వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 30 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో డీఎంఈ, డీహెచ్  పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంఎన్‌జే సంస్థల్లో 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో 127, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ విభాగంలో 8, మహాత్మాజ్యోతిబా పూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్  వెల్ఫేర్ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్‌లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు.


ALSO READ:


ఆగస్టు 1 నుంచి గురుకుల పోస్టుల నియామక పరీక్షలు, అభ్యర్థులకు ముఖ్య సూచనలు
తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 1 నుంచి నియామక పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.  పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 104 కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ పోస్టులకు మొత్తం 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.  ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 1 నుంచి 23 వరకు పరీక్షలు జరగునున్నాయి. ఆయా తేదీల్లో మూడు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించ‌నున్నారు. మొద‌టి షిఫ్ట్ ఉద‌యం 8:30 నుంచి 10:30 వ‌ర‌కు, రెండో షిఫ్ట్ 12:30 నుంచి మ‌ధ్యాహ్నం 2:30 వ‌ర‌కు, మూడో షిఫ్ట్ సాయంత్రం 4:30 నుంచి 6:30 గంట‌ల వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు.  
పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


'గ్రూప్‌-2' పరీక్ష తేదీల్లో మార్పుల్లేవ్! షెడ్యూలు ప్రకారమే పరీక్షల నిర్వహణ
తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనుంది. అయితే గ్రూప్‌-3 పరీక్ష తేదీల ఖరారుతోపాటు గ్రూప్‌-1 మెయిన్స్‌, కళాశాల లెక్చరర్లు, సంక్షేమ వసతిగృహాల అధికారులు (హెచ్‌డబ్ల్యూవో), డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారుల (డీఏవో) పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు 'గ్రూప్‌-2' పరీక్షను వాయిదా వేయాలని కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..