TS SI Constable Results : తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇటీవల నిర్వహించిన ప్రాథమిక పరీక్షల ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది.  సివిల్‌ ఎస్ఐ ప్రాథమిక పరీక్షలో 46.80 శాతం, సివిల్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలో 31.40 శాతం, రవాణా కానిస్టేబుల్‌ పరీక్షలో 44.84 శాతం, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పరీక్షలో 43.65 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్ సైట్ లో ఫలితాలు చేసుకోవచ్చు. పోలీస్‌ సివిల్‌ విభాగంలో 15,644.. ఆబ్కారీశాఖలో 614.. రవాణాశాఖలో 63 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం 1601 కేంద్రాల్లో  ఆగస్టు 7న ప్రాథమమిక పరీక్ష జరిగింది. మొత్తం 6,61,198 మంది దరఖాస్తుదారులకుగాను 6,03,955 (91.34శాతం) మంది హాజరయ్యారు.


ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి


తగ్గిన కటాఫ్ మార్కులు 


పోలీసు ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఫలితాలను సెప్టెంబరులోనే వెల్లడించాలని తొలుత పోలీసు నియామక మండలి నిర్ణయించింది. అయితే ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్ని తగ్గిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించడంతో ఫలితాల వెల్లడి ఆగిపోయింది. ఈక్రమంలో కటాఫ్ మార్కులను బీసీ అభ్యర్థులు 25 శాతం (50 మార్కులు); ఎస్సీ, ఎస్టీ లేదా ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 20 శాతం (40) మార్కులు సాధిస్తే అర్హత సాధిస్తారని పోలీసు నియామక మండలి  అక్టోబరు 2న ఉత్తర్వులు విడుదల చేసింది. ఓసీ అభ్యర్థుల కటాఫ్ మార్కులను యథాతథంగా 30 శాతం(60 మార్కులు)గానే ఉంచాలని నిర్ణయించింది.  


నవంబర్ లో ఫిజికల్ టెస్టులు 


రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్‌ఐ పోస్టులకు  ఆగస్టు 7న, అలాగే 16,321 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆగస్టు 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎస్‌ఐ రాతపరీక్షకు 2,47,217 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక కానిస్టేబుల్ పరీక్షకు మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫలితాల్లో అర్హత సాధించే అభ్యర్థులకు నవంబరులో ఫిజికల్ ఎఫిషియెన్సీ, మెజర్‌మెంట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పంపించే లేఖల్లోనే వాటిని నిర్వహించే వేదిక, పరీక్ష తేదీ వివరాలను నియామక మండలి వెల్లడించనుంది.


Also Read : TS Police Exam Result: ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాల్లో 41.67 శాతం ఉత్తీర్ణులు, ఆన్సర్ కీ కూడా వచ్చేసింది!