Telangana DSC 2024 Answer Key: తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ-2024 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ 'కీ'ని పాఠశాల విద్యాశాఖ ఆగస్టు 13న విడుదల చేసింది. సబ్జెక్టులవారీగా స్కూల్ అసిస్టెంట్ (SA), సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT), లాంగ్వే్జ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షల ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పా్న్స్ షీట్లను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


అభ్యంతరాలకు అవకాశం..
అభ్యర్థులకు ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆగస్టు 20న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల టెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే.. సంబంధిత ఈ-మెయిల్‌కు వివరాలు పంపి సవరించుకోవచ్చని ఆయన వెల్లడించారు.


ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తులు అంగా... మొత్తం 2,45,263 మంది (87.61 శాతం) పరీక్షలకు హాజరయ్యారు. డీఎస్సీ పరీక్షలకు 34,694 మంది అభ్యర్థులు గైర్హజరయ్యారు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబరు 5 నాటికి నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వ యోచనగా ఉంది.


TGDSC 2024 - Initial Key


TGDSC 2024 - Response Sheets


TGDSC 2024 - Answer Key Objections


Website


తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం ఖాళీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్-6,508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2,629 పోస్టులు,  లాంగ్వేజ్ పండిట్-727, పీఈటీలు-182 పోస్టులు, ప్రత్యేక కేటగిరీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్లు 220 పోస్టులు, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. ఇక జిల్లావారీగా ఖాళీల వివరాలు పరిశీలిస్తే.. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 93 ఖాళీలను భర్తీ చేయనన్నారు. ఆ తర్వాత స్థానాల్లో రాజన్న సిరిసిల్ల (151), వనరపర్తి (152) ఉన్నాయి.


రాష్ట్రంలో జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో  జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్‌ పరీక్ష, సెకండ్‌షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్ష జరగనున్నాయి. ‌జులై 19 నుంచి 22 వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక జులై 22న స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్, జులై 24న స్కూల్ అసిస్టెంట్ బయాలాజికల్‌ సైన్స్‌, జులై 25న స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, మరాఠీ), ‌జులై 26న తెలుగు భాషా పండిట్‌, సెకండరీ గ్రేడ్‌టీచర్‌ పరీక్ష, జులై 30న స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్, జులై 31న స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్), స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్ సైన్స్), స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్); ఆగస్టు 1న సెకండరీ గ్రేడ్ టీచర్ (ఇంగ్లిష్, తెలుగు), స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్), ఆగస్టు 2న లాంగ్వేజ్ పండిట్(తెలుగు), స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్), స్కూల్ అసిస్టెంట్ (హిందీ), లాంగ్వేజ్ పండిట్ (కన్నడ, మరాఠీ, ఉర్దూ, సంస్కృతం), ఆగస్టు 5న స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), లాంగ్వేజ్ పండిట్ (హిందీ) పరీక్షలు నిర్వహించారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..