High Court Jobs: తెలంగాణ హైకోర్టులో 45 సిస్టం అసిస్టెంట్ ఉద్యోగాలు, అర్హతలు ఇవే!

సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా/బీఎస్సీ డిగ్రీతోపాటు కంప్యూటర్ హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అనభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Continues below advertisement

తెలంగాణ హైకోర్టు  సిస్టం అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఓసీలకు 23, బీసీలకు 13, ఎస్సీలకు 6, ఎస్టీలకు 3 పోస్టులు కేటాయించారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా/బీఎస్సీ డిగ్రీతోపాటు కంప్యూటర్ హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అనభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 

Continues below advertisement

పోస్టుల వివరాలు..

* సిస్టం అసిస్టెంట్: 45 పోస్టులు

అర్హతలు: ఇంజినీరింగ్ డిగ్రీ (సీఎస్‌ఈ/ఐటీ/ఈసీఈ)/డిప్లొమా(ఎలక్ట్రానిక్స్)/బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్స్/ఐటీ) డిగ్రీతోపాటు కంప్యూటర్ హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అవగాహన ఉండాలి.

వయోపరిమితి: 11.01.2023 నాటికి 18-34 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష,  టైపింగ్ టెస్ట్, ఇంటర్వూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.

పరీక్ష విధానం..

➥ మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. వీటిలో రాతపరీక్షకు 90 మార్కులు, వైవా-వాయిస్‌కు 10 మార్కులు కేటాయిస్తారు. వీటిలో నుంచి 1:3 నిష్పత్తిలో అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

➥ మొత్తం 90 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇందులో జనరల్ నాలెడ్జ్-40 ప్రశ్నలు-40 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్-30 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-20 ప్రశ్నలు-20 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 2 గంటలు(120 నిమిషాలు).

➥ అర్హత మార్కులను ఓసీలకు 45%, బీసీలకు 40%, ఎస్సీ-ఎస్టీలకు 35% గా నిర్ణయించారు.  

జీతభత్యాలు: రూ.24,280 - రూ.72,850. 

ముఖ్యమైన తేదీలు..

➥ నోటిఫికేషన్ల వెల్లడి: 11.01.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.01.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.02.2023. (11.59 PM)

➥ పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 20.02.2023.

➥  కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష తేది: మార్చిలో పరీక్ష నిర్వహిస్తారు.

Notification

Website

                                         

Also Read:

పోలీసు అభ్యర్థులకు అలర్ట్, తుది పరీక్షల తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూలు ఇదే!
పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో ఇతర పరీక్షలు ఉండటంతో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన విన్నపంతో పోలీసు నియామక మండలి మార్పులు చేసింది. దీంతో ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్ పరీక్ష ఏప్రిల్ 30కి వాయిదా పడింది. కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షను కూడా ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30కి మార్చారు. అదే విధంగా మార్చి 12న జరగాల్సిన ఎ‌స్‌ఐ(ఐటీ) పరీక్షను మార్చి 11కి మార్చారు. ఇక ఏఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్) పరీక్షను కూడా మార్చి 12 నుంచి 11కి మార్చారు.  
పరీక్ష పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ హైకోర్టులో 20 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు, అర్హతలు ఇవే!
తెలంగాణ హైకోర్టు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఓసీలకు 10, బీసీలకు 6, ఎస్సీలకు 3, ఎస్టీలకు 1 పోస్టు కేటాయించారు. ఏదైనా డిగ్రీతోపాటు టైపింగ్(హయ్యర్‌గ్రేడ్) సర్టిఫికేట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola