తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 1 నుంచి నియామక పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.  పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 104 కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ పోస్టులకు మొత్తం 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. 


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 1 నుంచి 23 వరకు పరీక్షలు జరగునున్నాయి. ఆయా తేదీల్లో మూడు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించ‌నున్నారు. మొద‌టి షిఫ్ట్ ఉద‌యం 8:30 నుంచి 10:30 వ‌ర‌కు, రెండో షిఫ్ట్ 12:30 నుంచి మ‌ధ్యాహ్నం 2:30 వ‌ర‌కు, మూడో షిఫ్ట్ సాయంత్రం 4:30 నుంచి 6:30 గంట‌ల వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు.  ఇప్పటికే హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులకు అధికారులు కీలక సూచనలు చేశారు. 


పరీక్షల షెడ్యూలు ఇలా..


పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


అభ్యర్థులకు ముఖ్య సూచనలు..


➥  అభ్యర్థులందరూ తమకు సూచించిన సమయంలోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.


➥ ప్రతి షిఫ్టు పరీక్షకు 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తారు. ఆ తరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ అభ్యర్థులను పరీక్ష గదుల్లోకి అనుమతించరు. 


➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనసరిగా హాల్‌టికెట్ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. హాల్‌టికెట్‌తోపాటు అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన


ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు తప్పనిసరి తీసుకురావాలి. గుర్తింపు కార్డు లేకుంటే పరీక్ష గదిలోకి అనుమతించరు. 


➥  హాల్‌టికెట్‌పై ఫొటో లేకపోయినా, ఫోటో సరిగా లేకపోయినా.. మూడు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలపై గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ, అండర్‌టేకింగ్‌ ధ్రువీకరణ పత్రం తీసుకుని ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. లేకుంటే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.


➥ హాల్‌టికెట్‌, గుర్తింపు కార్డు, నామినల్‌ రోల్‌లలో ఫొటోలు వేర్వేరుగా ఉన్నా.. అభ్యర్థి వ్యక్తిగత ధ్రువీకరణలో లోపాలు గుర్తించినా.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. నియామక ప్రక్రియ పూర్తయ్యేవరకు అభ్యర్థులు హాల్‌టికెట్లు భద్రంగా ఉంచుకోవాలి.


➥ అన్ని తనిఖీలు పూర్తిచేసి, గుర్తింపును ధ్రువీకరించాకే అభ్యర్థులను పరీక్ష గదిలోకి అనుమతిస్తారు.


➥ మొత్తం 19 రోజులపాటు రోజుకు మూడు షిఫ్టుల్లో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి పరీక్ష సమయం రెండు గంటలు. ఉదయం షిఫ్టు 8.30 నుంచి 10.30, మధ్యాహ్నం షిఫ్టు 12.30 నుంచి 2.30, సాయంత్రం షిఫ్టు 4.30 నుంచి 6.30 గంటల వరకు జరుగుతుంది.


➥ పరీక్షలకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్‌, ఫొటో తీసుకుంటారు. 


➥  పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తరువాత పరీక్ష ముగిసేవరకు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదు. 


➥ కాగితాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, నిషేధిత వస్తువులను తీసుకెళ్లకూడదు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి. బూట్లతో పరీక్ష గదిలోకి అనుమతించారు.


➥ పరీక్ష ప్రారంభానికి 10 నిమిషాల ముందు పాస్‌వర్డ్‌ చెబుతారు. కంప్యూటర్‌లో దీన్ని నమోదు చేశాక అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు వస్తాయి. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి స్క్రీన్‌పై ప్రశ్నలు ప్రత్యక్షమవుతాయి. గడువు ముగిసిన తరువాత స్క్రీన్‌ అదృశ్యమవుతుంది. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే కంప్యూటర్‌ ఆటోమేటెడ్‌గా అదనపు సమయం ఇస్తుంది.


➥ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. పేపర్‌-1, 2, 3లో తప్పుగా రాసిన ప్రతి సమాధానానికి పావు(0.25) మార్కు కోత విధిస్తారు.


ALSO READ:


టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-1' ఫైనల్ ఆన్సర్ 'కీ' వచ్చేస్తోంది! ఎప్పుడంటే?
తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీ ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జులై 31 లేదా లేదా ఆగస్టు 1న ప్రకటించే అవకాశం ఉంది. జూన్ 28న ప్రాథమిక కీని విడుదల చేసి టీఎస్‌పీఎస్సీ జులై 1 నుంచి జులై 5 వరకు ఆన్సర్ కీ అభ్యంతరాలు స్వీకరించింది. అభ్యంతరాలను పరిగణనలోకీ తీసుకుని పరిశీలించిన విషయ నిపుణులు రూపొందించిన గ్రూప్-1 తుది కీని విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


'గ్రూప్‌-2' పరీక్ష తేదీల్లో మార్పుల్లేవ్! షెడ్యూలు ప్రకారమే పరీక్షల నిర్వహణ
తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనుంది. అయితే గ్రూప్‌-3 పరీక్ష తేదీల ఖరారుతోపాటు గ్రూప్‌-1 మెయిన్స్‌, కళాశాల లెక్చరర్లు, సంక్షేమ వసతిగృహాల అధికారులు (హెచ్‌డబ్ల్యూవో), డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారుల (డీఏవో) పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు 'గ్రూప్‌-2' పరీక్షను వాయిదా వేయాలని కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..