TGPSC Group2 Primary Key: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక 'కీ' ని జనవరి 18న విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ(TGPSC) ఓ ప్రకటనలో తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందబాటులో ఉంచనుంది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా కమిషన్ విడుదల చేయనుంది. అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో ప్రాథమిక కీ అభ్యంతరాలను స్వీకరిస్తారు. రాష్ట్రంలో 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది.  రెండు రోజుల పాటు నాలుగు సెషన్లలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు గ్రూప్–2 పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1368 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. 

Continues below advertisement


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 8వ తేదీన టీజీపీఎస్సీ కమిషన్‌ తెలంగాణ గ్రూప్‌ 3 ప్రిలిమినరీ కీ విడుదల చేసింది. త్వరలో గ్రూప్‌ 1, 2, 3 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు. దానికి సంబంధించి తగిన విధంగా టీజీపీఎస్సీ కమిషన్‌ కసరత్తు చేస్తోంది.


Website