నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవల గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి కాగా, త్వరలో గ్రూప్-2, 3, 4 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనుంది. రాబోవు నోటిఫికేషన్లలో గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 కేటగిరీల్లో మరిన్ని పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన శాఖ సవరించింది. ఇందుకు సంబంధించి గురువారం (నవంబరు 24న) ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో గ్రూప్-2లో 6, గ్రూప్-3లో 2, గ్రూప్-4లో 4 రకాల పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రూప్-2, 3, 4లో పోస్టులు మరిన్ని పెరిగే అవకాశం ఉంది.
గ్రూప్-2లో చేర్చిన పోస్టులు ఇవీ..
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిష్ సర్వీస్)
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇతర శాఖలకు సంబంధించి)
➥ జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్
గ్రూప్-3లో చేర్చిన పోస్టులు ఇవీ..
➥ గిరిజ సంక్షేమ శాఖ అకౌంటెంట్
➥ సీనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ లేదా హెచ్‌ఓడీల్లో ఇదే విధమైన పోస్టులు
గ్రూప్-4లో చేర్చిన పోస్టులు ఇవీ..
➥జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్
➥ జువైనల్ సర్వీసెస్ సూపర్‌వైజర్ (మేల్) (జువైనల్ సర్వీసెస్, డబ్య్లూసీడీ అండ్ ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్)
➥ మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్
➥ మ్యాట్రన్ (కమిషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్)
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ వేగవంతం చేస్తున్నామంటున్నారు టీఎస్పీఎస్సీ అధికారులు..గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ తరువాత మరో వారం నుండి పది రోజుల్లో గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఇప్పటికే గ్రూప్-3, గ్రూప్-2 నోటిఫికేషన్లపై టీఎస్‌పీఎస్సీ అధికారులు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా గిరిజన రిజర్వేషన్ల పెంపుతోపాటు, రోస్టర్ పాయింట్ల ఖరారు వంటి చర్యలు పూర్తి చేయడంతో నియామకాల ప్రక్రియ శరవేగంగా పూర్తిచేస్తామని అధికారులు అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇప్పటికే 503 'గ్రూప్-1' పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షలను పూర్తిచేసింది. దీనికి సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీ కూడా విడుదల చేసింది. ఇక 'గ్రూప్-2' కింద 663 పోస్టులకు, 'గ్రూప్-3' కింద 1373 పోస్టులకు, 'గ్రూప్-4' కింద 1298 పోస్టులకు అనుమతి తెలిపింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాల్లో మరికొన్నింటిని అదనంగా చేర్చుతూ గురువారం (నవంబర్ 24) రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2, 3, 4 నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ సవరించింది. గ్రూప్-2లో మరో ఆరు రకాల పోస్టులు, గ్రూప్-3లో రెండు పోస్టులు, గ్రూప్-4లో మరో నాలుగు రకాల పోస్టులను చేర్చుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read:
నవోదయ విద్యాలయ సమితిలో 2,200 టీచర్ పోస్టుల భర్తీ - రాత పరీక్ష షెడ్యూలు వెల్లడి!
వోదయ విద్యాలయ సమితిలో 2200 పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూలు విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూలును అందుబాటులో ఉంచారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 28 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను నవంబరు 25 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
జిల్లా కోర్టుల్లో 3432 ఉద్యోగాల భర్తీ, అభ్యర్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూలు వెల్లడి!
ఏపీలోని జిల్లా కోర్టుల్లో 3432 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూలును నవంబరు 23న ఏపీ హైకోర్టు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీలను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష పోస్టులవారీగా పరీక్షల తేదీలను చూసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 21న ప్రారంభమయ్యే పరీక్షలు జనవరి 2తో ముగియనున్నాయి. పోస్టుల ఆధారంగా తగినన్ని షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..