TS Constable Appointment Letters: తెలంగాణలో కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 14న ఎల్‌బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో 15,750 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ మేరకు హోంశాఖ ఏర్పాట్లుచేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) 2022 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు గతేడాది అక్టోబరులోనే తుది ఎంపిక జాబితా ప్రకటించింది.

తెలంగాణలో పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, రవాణా, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) విభాగాల కోసం 12,866 మంది పురుషులు.. 2,884 మంది మహిళా అభ్యర్థులను ఎంపిక చేసింది. అర్హులు లేకపోవడంతో 854 పోస్టులను బ్యాక్‌లాగ్‌గా పరిగణించారు. పోలీసు రవాణా సంస్థలో 100 డ్రైవర్ పోస్టులతోపాటు అగ్నిమాపకశాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను మాత్రం న్యాయస్థానాల్లో వ్యాజ్యాల కారణంగా వెల్లడించలేదు. అయితే ఆ అడ్డంకులు తొలిగిపోవడంతో తాజాగా ఎంపిక పత్రాలను అందజేయాలని హోంశాఖ నిర్ణయించింది.

విభాగాలవారీగా కానిస్టేబుల్ పోస్టుల జాబితా..

పోస్టు మొత్తం ఖాళీల సంఖ్య ఎంపికైన అభ్యర్థులు (పురుషులు) ఎంపికైన అభ్యర్థులు (మహిళలు)
సివిల్  4965 3298 1622
ఏఆర్ 4423 2982 948
ఎస్ఏఆర్ సీపీఎల్ 100 100 -
టీఎస్‌ఎస్‌పీ 5010 4725 -
ఎస్పీఎఫ్ 390 382 -
ఫైర్‌మెన్లు 610 599 -
వార్డర్లు (మెన్) 136 134 -
వార్డర్లు (ఉమెన్) 10 - 10
ఐటీ & కమ్యూనికేషన్ 262 171 86
పోలీస్ ట్రాన్స్‌పోర్ట్  21 21 -
రవాణాశాఖ (హెడ్‌క్వార్టర్) 06 04 02
రవాణాశాఖ (ఎల్‌సీ) 57 44 13
ఎక్సైజ్ 614 406 203
మొత్తం 16,604 12,866 2,884

2,090  గురుకుల అభ్యర్థులకు కూడా..
కానిస్టేబుల్ పోస్టుల నియామక పత్రాలతోపాటు  తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకుల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎంపికైన 2,090 మంది అభ్యర్థులకు కూడా నేడు సీఎం రేవంత్‌ రెడ్డి నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు సమాచారం. వీటిలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌, డిగ్రీ, జూనియర్‌ కాలేజీలు, స్కూళ్లోలని లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. ఒకవేళ ఇవాళ కుదరకపోతే, రేపు ఇస్తారని తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని పోస్టుల భర్తీ కూడా జరుగుతుంది అని చెబుతోంది. 2023 సంవత్సరంలో 9,210 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా ఇటీవలే ఫలితాలు వెల్లడించి ధ్రువపత్రాల పరిశీలన జరిపారు.  తాజాగా ఎంపికైనవారికి నియామక పత్రాలు అందజేయనున్నారు. త్వరలో మరో 7వేల పోస్టులకు సంబంధించి భర్తీ పూర్తికానుంది.

ALSO READ:

ఉద్యోగ పరీక్షల వయోపరిమితి పెంపు - ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వయోపరిమితిని 44 సంవత్సరాల నుంచి 46 ఏళ్లకు పెంచింది. అయితే యూనిఫామ్ సర్వీసులకు మాత్రం మినహాయింపునిచ్చింది. వయోపరిమితి నుంచి సడలింపు ఇచ్చింది. ఈ మేరకు నిర్దేశించిన గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గ్రూప్-1 సహా చాలా పోటీ పరీక్షల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తోంది. అయతే ఐతే ప్రశ్నపత్రాల లీకేజీల వల్ల, పరీక్షల నిర్వహణ వాయిదా పడుతోంది. దాంతో వారి వయసు పెరిగిపోతోంది. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో.. వయసు పెరిగినా, అభ్యర్థులు, పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు వీలు కలగనుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..