Teaching Jobs in Hyderabad: ఉప్పల్ కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ జాబ్స్.. ఎగ్జామ్ లేకుండానే పోస్టుల భర్తీ
ఉప్పల్ కేంద్రీయ విద్యాలయాలు (KV 1 & 2)లో 2026-27 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

హైదరాబాద్‌లోని ఉప్పల్ లో ఉన్న PM కేంద్రీయ విద్యాలయ నంబర్ 1, నంబర్ 2 పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను పార్ట్-టైమ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ మేరకు టీచర్ జాబ్స్ కు అభ్యర్థులను రిక్రూట్ చేయడానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 19, 2026 (గురువారం) నాడు జరిగే ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. ఉప్పల్ కేంద్రీయ విద్యాలయాల్లో (KV 1 & 2) 2026-27 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన టీచర్ల నియామకం జరుగుతుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇంటర్వ్యూ వివరాలు, పోస్టులు
ఈ నియామక ప్రక్రియ రెండు వేర్వేరు వేదికల్లో నిర్వహించనున్నారు.
వేదిక 1: PM SHRI KV No. 1 ఉప్పల్ (రామాంతపూర్ రోడ్)
పోస్టులు: TGT (ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, గణితం, సైన్స్, సోషల్ సైన్స్), తెలుగు టీచర్ (రీజినల్ లాంగ్వేజ్), కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, డ్యాన్స్ కోచ్, వోకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్ (అథ్లెటిక్స్/కబడ్డీ/ఖో-ఖో/ తైక్వాండో), యోగా ఇన్‌స్ట్రక్టర్.
సమయం: ఫిబ్రవరి 19న ఉదయం 9:00 నుండి 10:00 వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతాయి.

వేదిక 2: KV No. 2 ఉప్పల్ (GHMC ఆఫీస్ పక్కన)
పోస్టులు: PGT (ఫిజిక్స్, ఎకనామిక్స్), ప్రైమరీ టీచర్స్ (PRT), బాలవాటిక టీచర్స్ (ప్రీ-ప్రైమరీ), ఆర్ట్ & క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, నర్సు పోస్టులు ఉన్నాయి.
సమయం: ఫిబ్రవరి 19న రిజిస్ట్రేషన్ ఉదయం 9:00 నుండి 10:00 వరకు, ఇంటర్వ్యూలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు కొనసాగుతాయి.
ముఖ్యమైన అర్హతలు, సూచనలు
CTET నిబంధన: PRT పోస్టులకు CTET (పేపర్-1) మరియు TGT పోస్టులకు CTET (పేపర్-2) క్వాలిఫై కావడం తప్పనిసరి.
భాషా నైపుణ్యం: హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాలలో బోధించగల సామర్థ్యం ఉండాలి.
డాక్యుమెంట్లు: అభ్యర్థులు ఇంటర్వ్యూ రోజున ఉదయం 8:30 గంటలకే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ ఫోటోస్టాట్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో రిపోర్ట్ చేయాలి. ఇంటర్వ్యూ తేదీ నాటికే అభ్యర్థులు సంబంధిత విద్యార్హతలు కలిగి ఉండాలి.
మరింత సమాచారం కోసం అభ్యర్థులు పాఠశాల అధికారిక వెబ్‌సైట్ https://no1uppal.kvs.ac.in ను, https://no2uppal.kvs.ac.in లో సందర్శించాలని కేవీ అధికారులు సూచించారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారికి ఎటువంటి ప్రయాణ ఖర్చులు (TA/DA) చెల్లించడం లేదు.























