టాటా స్టీల్ సంస్థ టాటా స్టీల్ అస్పైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్-2023 ద్వారా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంజినీర్ ట్రెయినీ శిక్షణను పూర్తిచేసిన అభ్యర్థులకు ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు.
వివరాలు...
* టాటా స్టీల్ అస్పైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్-2023
- ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 01.02.2023 వరకు 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు వరకు వయసులో సడలింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: కాగ్నిటివ్, టెక్నికల్ టెస్ట్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు: శిక్షణ సమయంలో స్టైపెండ్ నెలకు రూ.30000 చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఏటా రూ.6.24లక్షలు చెల్లిస్తారు.
దరఖాస్తు చివరితేది: 03.03.2023.
Also Read:
Indian Navy: ఇండియన్ నేవీలో 248 ట్రేడ్స్‌మ్యాన్ స్కిల్డ్ పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ నేవీలో ట్రేడ్స్ మ్యాన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు నేవీకి చెందిన నావికాదళ యూనిట్లు/ నిర్మాణ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అభ్యర్థులు మార్చి 3 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
C-DAC Recruitment: సీడాక్‌లో 570 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడాక్) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 570 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 20లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
'సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్)-2023' నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం (ఫిబ్రవరి 1) విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 21 వరకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..