ముంబ‌యి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ రెగ్యులర్/ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంసీఏ/ ఎంఈ, ఎంటెక్/ ఎంఎస్సీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో దరఖాస్తు ఫీజు చెల్లించి.. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక చేస్తారు.


వివరాలు..


మొత్తం ఖాళీల సంఖ్య: 36


1. డిప్యూటీ మేనేజర్(డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్): 06 పోస్టులు


2. డిప్యూటీ మేనేజర్(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్): 02 పోస్టులు


3. డిప్యూటీ మేనేజర్(జావాడెవలపర్): 05 పోస్టులు


4. డిప్యూటీ మేనేజర్(డబ్ల్యూఏఎస్ అడ్మినిస్ట్రేటర్): 03 పోస్టులు


5. సీనియర్ ఎగ్జిక్యూటివ్(ఫ్రంటెండ్ యాంగ్యులర్ డెవలపర్): 03 పోస్టులు


6. సీనియర్ ఎగ్జిక్యూటివ్(పీఎల్ఎస్ క్యూఎల్ డెవలపర్): 03 పోస్టులు


7. సీనియర్ ఎగ్జిక్యూటివ్(జావా డెవలపర్): 10 పోస్టులు


8. సీనియర్ ఎగ్జిక్యూటివ్(టెక్నికల్ సపోర్ట్): 01 పోస్టు


9. ఎగ్జిక్యూటివ్(టెక్నికల్ సపోర్ట్): 02 పోస్టులు


10. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్(టెక్నాలజీ ఆర్కిటెక్ట్): 01 పోస్టు  


అర్హత: బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్) లేదా ఎంసీఏ/ ఎంఈ, ఎంటెక్/ ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 31.07.2022 నాటికి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 32 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


ఎంపిక విధానం: డీఎం పోస్టులకు ఆన్‌లైన్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా, మిగిలిన పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, సీటీసీ నెగోషియేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


పరీక్ష విధానం:


✦ మొత్తం మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్-120 మార్కులు (రీజనింగ్-50, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-35, ఇంగ్లిష్-35), ప్రొఫెషనల్ నాలెడ్జ్-150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.


✦ జనరల్ ఆప్టిట్యూడ్‌కు 90 నిమిషాలు, ప్రొఫెషనల్ నాలెడ్జ్‌కు 70 నిమిషాల సమయం కేటాయించారు.


✦ ఇంటర్వ్యూకు 25 మార్కులు కేటాయించారు.


✦ ప్రొఫెషనల్ నాలెడ్జ్‌లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జాబితాను తయారుచేస్తారు.


పని ప్రదేశం: నవీ ముంబయి.


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేదీ: 09.12.2022.


ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేదీ: 29.12.2022.


ఆన్‌లైన్ తాత్కాలిక పరీక్ష తేదీ: జనవరి/ ఫిబ్రవరి 2023.


ఆన్‌లైన్ పరీక్ష కోసం కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేయడానికి తాత్కాలిక తేదీ: జనవరి/ఫిబ్రవరి.


Notification 


Online Application Form 


Website 


Also Read:


యూనియన్‌ బ్యాంక్‌లో వివిధ ఉద్యోగాలు, అర్హతలివే!
యూనియన్ బ్యాంక్ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ ఎంబీఏ/ పీహెచ్‌డీ/ ఎంఫిల్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. 
నోటిఫికేషన్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్  విడుదల చేసింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో పోస్టుల వివరాలు అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచీలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


కేంద్రీయ విద్యాలయాల్లో కొలువుల మేళా, 13404 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు! 
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...