SBI Recruitment of Junior Associates: దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం 'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)' క్లర్క్‌(Junior Associate) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో 13,735 జూనియర్‌ అసోసియేట్స్‌ (క్లరికల్‌ కేడర్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణులైనవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తెలుగు రాష్ట్రాలకు  సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 342; అమరావతి సర్కిల్‌లో 50 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 17న ప్రారంభంకాగా.. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 7 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు.... 


* జూనియర్‌ అసోసియేట్స్‌ (క్లరికల్‌ కేడర్‌) పోస్టులు


ఖాళీల సంఖ్య: 13,735 పోస్టులు 


రాష్ట్రాల వారీగా ఖాళీలు: గుజరాత్- 1073, ఆంధ్రప్రదేశ్- 50, కర్ణాటక- 50, మధ్యప్రదేశ్- 1317, ఛత్తీస్‌గఢ్- 483, ఒడిశా- 362, హరియాణా- 306, జమ్ము & కశ్మీర్ యూటీ- 141, హిమాచల్ ప్రదేశ్- 170, చండీగఢ్ - 32, లడఖ్ యూటీ- 32, పంజాబ్- 569, తమిళనాడు- 336, పుదుచ్చేరి- 04, తెలంగాణ- 342, రాజస్థాన్- 445, పశ్చిమ బెంగాల్- 1254, అండమాన్‌ & నికోబార్‌ దీవులు- 70, సిక్కిం- 56, ఉత్తర్‌ప్రదేశ్- 1894, మహారాష్ట్ర- 1163, గోవా- 20, దిల్లీ- 343, ఉత్తరాఖండ్- 316, అరుణాచల్ ప్రదేశ్- 66, అస్సాం- 311, మణిపుర్- 55, మేఘాలయ- 85, మిజోరం- 40, నాగాలాండ్- 70, త్రిపుర- 65, బిహార్- 1111, జార్ఖండ్- 676, కేరళ- 426, లక్షద్వీప్- 02.


విద్యార్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


వయోపరిమితి: 01.04.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.04.1996 - 01.04.2004 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు (జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) 10 సంవత్సరాలపాలు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 


ప్రిలిమినరీ పరీక్ష విధానం: మొత్తం100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు-30 మార్కులు; న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు; రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 (0.25) మార్కుల చొప్పున కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి తర్వాతి దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.  


మెయిన్‌ పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 190 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. ఇందులో జనరల్‌/ ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు-50 మార్కులు; జనరల్‌ ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు; క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు-50 మార్కులు; రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు. 


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో అనంతపురం, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 


బేసిక్‌ పే: నెలకు రూ.26,730.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.12.2024.


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 07.01.2025.


➥ ప్రిలిమినరీ పరీక్ష: 2025 ఫిబ్రవరిలో.  


➥ మెయిన్‌ పరీక్ష తేదీ: మార్చి/ ఏప్రిల్ 2025లో.


Notification


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..