సెలక్షన్ పోస్టుల పరీక్ష 2022 కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. పీడీఎఫ్ పార్మాట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. సెలక్షన్ పోస్టుల భర్తీకి సంబంధించి మెట్రిక్యులేషన్ లెవల్, హయ్యర్ సెకండరీ (10+2) లెవల్, గ్రాడ్యుయేషన్ & ఆపై స్థాయి పోస్టులకు సంబంధించిన ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. మూడు విభాగాల్లో కలిపి మొత్తం 31,599 మంది అభ్యర్థులు తర్వాతి దశకు ఎంపికయ్యారు.
➥ మెట్రిక్యులేషన్ లెవల్‌లో మొత్తం 9482 మంది అభ్యర్థులు తర్వాతి దశకు ఎంపికయ్యారు. వీరిలో జనరల్ అభ్యర్థులు 3720 ఉండగా, ఓబీసీ అభ్యర్థులు 2500, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 843, ఎస్సీ అభ్యర్థులు 1180, ఎస్టీ అభ్యర్థులు 660 మంది అర్హత సాధించారు. ఇక ఎక్స్-సర్వీస్‌మెన్ 300, OH/ HH/VH అభ్యర్థులు 199 మంది ఉన్నారు.
ఫలితాల (మెట్రిక్యులేషన్ లెవల్) కోసం క్లిక్ చేయండి..
ఫలితాల సమాచారం, కటాఫ్ మార్కుల వివరాలు
➥ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్‌లో మొత్తం 10,289 మంది మంది అభ్యర్థులు తర్వాతి దశకు ఎంపికయ్యారు. వీరిలో జనరల్ అభ్యర్థులు 5187 ఉండగా, ఓబీసీ అభ్యర్థులు 2260, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 553, ఎస్సీ అభ్యర్థులు 1550, ఎస్టీ అభ్యర్థులు 522 మంది అర్హత సాధించారు. ఇక ఎక్స్-సర్వీస్‌మెన్ 126, OH/ HH/VH అభ్యర్థులు 85 మంది, దివ్యాంగులు 6 మంది ఉన్నారు.
ఫలితాల (హయ్యర్ సెకండరీ లెవల్) కోసం క్లిక్ చేయండి..
ఫలితాల సమాచారం, కటాఫ్ మార్కుల వివరాలు
➥ ఇక గ్రాడ్యుయేషన్ & ఆపై స్థాయి పోస్టులకు మొత్తం 11,828 మంది అభ్యర్థులు తర్వాతి దశకు అర్హత సాధించారు. వీరిలో జనరల్ అభ్యర్థులు 4797, ఓబీసీ అభ్యర్థులు 3393, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 908, ఎస్సీ అభ్యర్థులు 1389, ఎస్టీ అభ్యర్థులు 812 మంది అర్హత సాధించారు. ఇక ఎక్స్-సర్వీస్‌మెన్ 248, OH/ HH/VH అభ్యర్థులు 268 మంది, దివ్యాంగులు 13 మంది ఉన్నారు.
ఫలితాల (గ్రాడ్యుయేషన్ లెవల్) కోసం క్లిక్ చేయండి..
ఫలితాల సమాచారం, కటాఫ్ మార్కుల వివరాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2065 సెలక్షన్ పోస్టుల భర్తీకి మే 12న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మే 12 నుంచి జూన్ 13 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. తర్వాత ఆగస్టు 1 నుంచి 5 వరకు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలకు సంబంధించి మెట్రిక్యులేషన్ లెవల్‌లో మొత్తం 5,55,011 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ పరీక్ష కోసం మొత్తం 3,75,662 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక గ్రాడ్యుయేషన్ & ఆపై స్థాయి పోస్టులకు మొత్తం 2,86,104 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
పరీక్షలో అర్హత మార్కులను జనరల్ అభ్యర్థులకు 35 శాతం (70 మార్కులు), ఓబీసీ/ఈడబ్యూఎస్ అభ్యర్థులకు 30 శాతం (60 మార్కులు), ఇతరులకు 25 శాతం (50 మార్కులు)గా నిర్ణయించారు. దాని ప్రకారం వచ్చిన మార్కుల ఆధారంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెలక్షన్ పోస్టుల ఫలితాలను విడుదల చేసింది.