SSC Constable Exam Schedule: కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్‌ జనరల్ డ్యూటీ (Constable GD), రైఫిల్‌ మ్యాన్‌ జనరల్ డ్యూటీ (Rifle Man GD) పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్షల తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) తాజాగా వెల్లడించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 25 మధ్య కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు.

కానిస్టేబుల్ జీడీ పరీక్ష విధానం..
మొత్తం 160 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ & రీజనింగ్‌ 20 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ & జనరల్‌ అవేర్‌నెస్‌ 20 ప్రశ్నలు-40 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ 20 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్‌/ హిందీ 20 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. కాగా నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు (అర మార్కు) కోత విధిస్తారు. 

కేంద్ర బలగాల్లో 39,481 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సెప్టెంబరు 5న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఖాళీల్లో పురుషులకు 35,612 పోస్టులు; మహిళలకు 3,869  పోస్టులు కేటాయించారు. ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(BSF)లో 15,654 పోస్టులు; సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 7,145 పోస్టులు; సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో 11,541 పోస్టులు; సశస్త్ర సీమాబల్‌(SSB)లో 819 పోస్టులు; ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సెస్(ITBP)లో 3,017 పోస్టులు; అస్సాం రైఫిల్స్(AR)లో 1,248 పోస్టులు; స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్(SSF)లో 35  పోస్టులు, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోలో 22 పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ఎన్‌సీబీలో సిపాయ్ పోస్టులకు పేలెవల్-1(రూ.18,000 - రూ.56,900), ఇతర పోస్టులకు పేలెవల్-3(రూ.21,700 -  రూ.69,100) కింద జీతభత్యాలు ఉంటాయి.

వివరాలు..

* కానిస్టేబుల్ పోస్టులు

 మొత్తం ఖాళీల సంఖ్య: 39,481

పోస్టుల కేటాయింపు: యూఆర్-16,782, ఈడబ్ల్యూఎస్-3851, ఓబీసీ-8576, ఎస్టీ-4454, ఎస్సీ-5818.

విభాగం పోస్టుల సంఖ్య పోస్టుల కేటాయింపు
బీఎస్‌ఎఫ్‌ 15,654 మెన్-13306, ఉమెన్-2348
సీఐఎస్‌ఎఫ్‌ 7,145 మెన్-6430, ఉమెన్-715
సీఆర్‌పీఎఫ్‌ 11,541 మెన్-11299, ఉమెన్-242
ఎస్‌ఎస్‌బీ 819  మెన్-819, ఉమెన్-0
ఐటీబీపీ 3,017 మెన్-2564, ఉమెన్-453
ఏఆర్ 1,248 మెన్-1148, ఉమెన్-100
ఎస్‌ఎస్‌ఎఫ్‌ 35  మెన్-35, ఉమెన్-0
ఎన్‌సీబీ 22 మెన్-11, ఉమెన్-11
మొత్తం ఖాళీలు 39,481 39,481

జీతం: ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ఎన్‌సీబీలో సిపాయ్ పోస్టులకు పేలెవల్-1(రూ.18,000 - రూ.56,900), ఇతర పోస్టులకు పేలెవల్-3(రూ.21,700 -  రూ.69,100) కింద జీతభత్యాలు ఉంటాయి.

ALSO READ:

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా

➥  యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 3,883 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి       

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...