కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 37,409 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్-2022 (టైర్-2) ఆన్సర్ 'కీ'ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 14న విడుదల చేసింది. ఎస్‌ఎస్‌సీ మార్చి 2 నుంచి 7 వరకు దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో సీజీఎల్‌ఈ టైర్-2 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చూసుకోవచ్చు.


ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీపై ఏమైనా  అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు మార్చి 14 సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 17న సాయంత్రం 6 గంటల వరకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.100 ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌ ద్వారానే అభ్యంతరాలు తెలపడానికి అవకాశం కల్పించారు.


సీజీఎల్‌ఈ 2022 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..


కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ (సీజీఎల్)-2022 పరీక్ష (టైర్- 1) ఫలితాలను ఫిబ్రవరి 9న విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 3,86,652 మంది అభ్యర్థులు టైర్-2 పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో 25071 మంది అభ్యర్థులు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ & అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు, 1149 మంది అభ్యర్థులు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు, 3,60,432 మంది అభ్యర్థులు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు సంబంధించి టైర్-2 కు ఎంపికయ్యారు. ఎంపికైనవారికి మార్చి 2 నుంచి 7 వరకు పరీక్షలు నిర్వహించారు. వీటిలో మార్చి 2, 3, 6, 7 తేదీల్లో పేపర్-1 పరీక్ష, అలాగే మార్చి 4న పేపర్-2, 3 పరీక్షలు నిర్వహించారు. 



పోస్టుల వివరాలు..


* ఖాళీల సంఖ్య: 20,000


➥ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్


➥ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్


➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్


➥ అసిస్టెంట్/ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్


➥ ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్


➥ ఇన్‌స్పెక్టర్ - సెంట్రల్ ఎక్సైజ్


➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)


➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)


➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్


➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)


➥ ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)


➥ ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)


➥ అసిస్టెంట్


➥ డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)


➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI/ CBN)/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌ఐఏ)


➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)


➥ ఆడిటర్ (కాగ్, సీజీడీఏ)


➥ అకౌంటెంట్ (కాగ్, సీజీఏ, etc.,)


➥ అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్


➥ పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)


➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్


➥ ట్యాక్స్ అసిస్టెంట్


➥ అప్పర్ డివిజన్ క్లర్క్.


నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:


యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 5,395 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!
నాగ్‌పూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 57వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని  ద్వారా మొత్తం 5,395 ఐటీఐ, నాన్ ఐటీఐ ఖాళీలను భర్తీచేయనున్నారు. మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 ఖాళీలు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు.నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


Assam Rifles: అస్సాం రైఫిల్స్‌లో 616 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు - అర్హతలివే!
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు మార్చి 19 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...