SSC CPO 2023 Paper 2 Answer Key: ఢిల్లీ పోలీస్, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ (CAPF) ఫోర్సెస్‌ విభాగంలో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించిన 'టైర్‌-2' రాతపరీక్ష ఆన్సర్ కీని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జనవరి 11న వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి జవాబులు చూసుకోవచ్చు. ఆన్సర్‌ కీతోపాటు అభ్యర్థులు రెస్పాన్స్ షీట్లను (సమాధాన పత్రాలను) కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.


అభ్యర్థులకు ఆన్సర్ కీపై అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు జనవరి 13న సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా అభ్యంతరాలు తెలపవచ్చు. అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.100 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా నమోదుచేసిన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అనంతరం తుది ఆన్సర్ కీతోపాటు పేపర్-2 ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు. పేపర్-2 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, డీఎంఈ (డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్) నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు. ఎంపికైతే నెలకు రూ.35,400-రూ.1,12,400 జీతం ఇస్తారు.


ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు, అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి...




ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 22న నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌‌లో ఖాళీలను భర్తీచేయనున్నారు. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. 


ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష-2023కు సంబంధించి పేపర్‌-1 (కంప్యూటర్ ఆధారిత) ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్టోబరు 25న విడుదల చేసిన సంగతి తెలిసిందే. పేపర్‌-1 పరీక్షలో 2607 మంది మహిళలు అర్హత సాధించగా.. 28,633 మంది పురుష అభ్యర్థుల అర్హత సాధించారు. ఇక ఢిల్లీ పోలీసు విభాగం నుంచి మొత్తం 182 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ ఈవెంట్లు (పీఈటీ/ పీఎస్‌టీ) నిర్వహించారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 8న పేపర్-2 పరీక్ష నిర్వహించారు. తాజాగా దీనికి సంబంధించిన ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.


పోస్టుల వివరాలు..


* ఎస్‌ఐ పోస్టులు 


ఖాళీల సంఖ్య: 1876 (పురుషులు-1710, మహిళలు-166).


పోస్టులవారీగా ఖాళీలు..


➥ ఢిల్లీ పోలీసు:​ 106 పోస్టులు


➥ బీఎస్​ఎఫ్​: 113 పోస్టులు


➥ సీఐఎస్​ఎఫ్:​ 630 పోస్టులు


➥ సీఆర్​పీఎఫ్​: 818 పోస్టులు


➥ ఐటీబీపీ: 63 పోస్టులు


➥ ఎస్​ఎస్​బీ: 90 పోస్టులు 





➥ ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్/ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థుల శారీరక ప్రమాణాలు (ఎత్తు, ఛాతీ), లాంగ్ జంప్, హైజంప్, షార్ట్​పుట్ నిర్వహిస్తారు. 


➥ డీఎంఈ (డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్) చివరగా పూర్తిస్థాయిలో అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు.


నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..