SSC CHSL 2026 Notification: ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL 2026)' నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్లో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల్లో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి సుమారు 2,536 పోస్టులను భర్తీ చేస్తారు. అప్లికేషన్లు సెప్టెంబర్ 7న ప్రారంభం అయ్యాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 7, 2026 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు & జీతాలు
LDC / JSA పోస్టులు (Pay Level-2)- రూ.19,900 నుంచి రూ.63,200 వరకు
DEO పోస్టులు (Pay Level-4): రూ.25,500 నుండి రూ.81,100 వరకు
DEO పోస్టులు (Pay Level-5): రూ.29,200 నుండి రూ.92,300 వరకు
DEO గ్రేడ్-A (Pay Level-4): రూ.25,500 నుండి రూ.81,100 వరకు
అర్హతలు & వయోపరిమితి
LDC / JSA / ప్రామాణిక DEO పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
DEO పోస్టులకు ఇంటర్లో సైన్స్ స్ట్రీమ్ (మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా) చదివి ఉండాలి.
అక్టోబర్ 7, 2026 నాటికి అవసరమైన అర్హతలను పొందాలి.
వయోపరిమితి
వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు ఆగస్టు 2, 1999కి ముందు, ఆగస్టు 1, 2008కి తర్వాత జన్మించి ఉండకూడదు. రిజర్వ్డ్ కేటగిరీల (SC, ST, OBC, PwD) అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది. Also Read: గుడ్న్యూస్.. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు
సెలెక్షన్ ప్రాసెస్
ఈ ఉద్యోగాల ఎంపిక రెండు విడతల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
టైర్-1 : ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ నుంచి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
టైర్-2 : టైర్-1లో అర్హత సాధించిన వారికి టైర్-2 ఎగ్జామ్ ఒకే రోజులో రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఇందులో సబ్జెక్ట్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్/స్కిల్ టెస్ట్ ఉంటాయి. Also Read: Gen Z నిజంగా అన్ఫిట్, 75% కంపెనీలకు కొత్త ఉద్యోగుల పని నచ్చడం లేదు: తాజా సర్వే
ఆన్లైన్లో దరఖాస్తు విధానం
- అధికారిక వెబ్సైట్ ssc.gov.in ఓపెన్ చేయండి.
- కొత్త అభ్యర్థులు అయితే'One Time Registration (OTR)' చేయాలి.
- లాగిన్ అయిన తర్వాత SSC CHSL 2026 Application Form సెలెక్ట్ చేయండి.
- మీ పర్సనల్, ఎడ్యుకేషన్ అర్హతల వివరాలను నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- సబ్మిట్ చేసిన తర్వాత ప్రింటౌట్ లేదా పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. Also Read: పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులంటే?
