SRM University Recruitment: మంగళగిరిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ వివిధ విభాగాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ప్రొఫెసర, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 11లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ & సైన్సెస్, ఈశ్వరీ స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్, పారీ స్కూల్‌ ఆఫ్ బిజినెస్ విభాగాల్లో ఖాళీలను భర్తీచేస్తారు.


వివరాలు..


* టీచింగ్ ఫ్యాకల్టీలు..


1. ప్రొఫెసర్


2. అసోసియేట్ ప్రొఫెసర్


3. అసిస్టెంట్ ప్రొఫెసర్


విభాగాలు..


➥ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ & సైన్సెస్
సబ్జెక్టులు: కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ & ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలాజికల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్. 


➥  ఈశ్వరీ స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్
సబ్జెక్టులు:  పాలిటిక్స్, సోషియాలజీ & ఆంథ్రోపాలజీ, ఎకనామిక్స్, సైకాలజీ, హిస్టరీ, లిటరేచర్ & లాంగ్వేజెస్, మీడియా స్టడీస్, కామర్స్.


➥  పారీ స్కూల్‌ ఆఫ్ బిజినెస్
సబ్జెక్టులు:  బిజినెస్ అనలిటిక్స్, అకౌంటింగ్ & ఫైనాన్స్, స్ట్రాటజీ & మార్కెటింగ్, ఓబీ & హెచ్‌ఆర్, ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ & ఫ్యామిలీ బిజినెస్.


అర్హతలు..


⫸ ప్రొఫెసర్ పోస్టులకు టీచింగ్/రిసెర్చ్/ఇండస్ట్రీ విభాగాల్లో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 5 సంవత్సరాలు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. 


⫸ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు టీచింగ్/రిసెర్చ్/ఇండస్ట్రీ విభాగాల్లో కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 5 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో పనిచేసిన అనుభవం ఉండాలి. 


⫸ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1 పోస్టులకు ప్రథమ శ్రేణిలో పీహెచ్‌డీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మంచి అకడమిక్ మెరిట్ ఉండాలి.


⫸ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టులకు టీచింగ్/రిసెర్చ్/ఇండస్ట్రీ విభాగాల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 2 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో పనిచేసిన అనుభవం ఉండాలి.


⫸ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-3 పోస్టులకు టీచింగ్/రిసెర్చ్/ఇండస్ట్రీ విభాగాల్లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 3 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో పనిచేసిన అనుభవం ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


 ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేది: 11.02.2024.


Online Application


Website




ALSO READ:


న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 300 అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్( NIACL) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 300 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న వారు  ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారా ఉద్యోగాల ఎంపిక చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.37,000 జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..